MP : మద్యం వ్యసనం ఎన్నో సంసారాలను విచ్ఛిన్నం చేస్తోంది. ఆర్థికంగా, ఆరోగ్యపరంగా ఎన్నో కుటుంబాలు నాశనం అవుతున్నాయి. మద్యం సేవించే ప్రతి వ్యక్తి చెడ్డవాడని దీని అర్థం కాదు. కానీ దాని మాయలో పడితే ఏం చేస్తారో కూడా అర్థం కాదు. చుట్టూ ఉన్న వ్యక్తుల గురించి మరచిపోయి తెలుసుకునే లోపే చాలా అనర్థాలు జరిగిపోతుంటాయి. అలాంటి హృదయ విదారక ఘటన మధ్యప్రదేశ్‌లోని మందసౌర్‌లో వెలుగు చూసింది. ఇక్కడ మద్యం మత్తులో ఉన్న భర్తతో మనస్తాపం చెందిన ఓ మహిళ తన నలుగురు అమాయక పిల్లలతో సహా ఆత్మహత్య చేసుకుంది. మద్యం మత్తులో ఉన్న భర్తపై మనస్తాపం చెందిన మహిళ బావిలో దూకి ఆత్మహత్యకు ప్రయత్నించింది. ఈ ఘటన మందసౌర్‌లోని గరోత్ పోలీస్ స్టేషన్ పరిధిలోని పిపాల్‌ఖేడా గ్రామంలో చోటు చేసుకుంది. ఘటన జరిగిన తర్వాత సకాలంలో స్థానికులు మహిళ రక్షించినప్పటికీ, నలుగురు పిల్లలు మాత్రం చనిపోయారు.
Read Also:Monkeys Attack: దారుణం.. 5 ఏళ్ల బాలుడిపై కోతుల దాడి.. చివరకు
ఆ మహిళకు ఇద్దరు అబ్బాయిలు, ఇద్దరు అమ్మాయిలు ఉన్నారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని గ్రామస్థులతో కలిసి మహిళను బావిలో నుంచి బయటకు తీసినా చిన్నారులను రక్షించలేకపోయారు. ఆ మహిళ పేరు సుగనా బాయి, ఆమె వయస్సు 40 సంవత్సరాలు. సమాచారం ప్రకారం ఆ మహిళకు భర్తతో చాలా గొడవలు జరుగుతున్నాయి. భర్త మద్యానికి బానిసై ఆ మహిళ చాలా ఇబ్బంది పడింది.
Read Also:Lionel Messi Crying: వెక్కివెక్కి ఏడ్చిన లియోనెల్ మెస్సీ.. వీడియో వైరల్!
మహిళ భర్త దుప్పట్లు అమ్మేవాడు. రోజూ మహిళను తాగొచ్చి కొట్టేవాడు. ఆ మహిళ తన భర్తతో గొడవ పడింది. ఆ తర్వాత మహిళ తన పిల్లలతో కలిసి బావిలో దూకింది. ప్రస్తుతం ఆ మహిళ ప్రాణాలతో బయటపడింది. పిల్లల మృతితో ఆ మహిళ దిగ్భ్రాంతికి గురైంది. పోలీసులు చిన్నారుల మృతదేహాలను స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం తరలించి కేసు దర్యాప్తు చేస్తున్నారు. ఘటనకు ముందు మహిళ శనివారం అంగన్‌వాడీ భవనంలో రాత్రి బస చేసి ఆదివారం ఉదయం బావి దగ్గరకు చేరుకుని ఈ ఘటనకు పాల్పడినట్లు గారోత్ ఏఎస్పీ హేమలత కురిల్ తెలిపారు. ప్రస్తుతం మహిళ ఆసుపత్రిలో చేరింది. గారోత్ పోలీస్ స్టేషన్ ఈ విషయంపై దర్యాప్తు చేస్తోంది.