Nalgonda Crime నల్గొండ జిల్లా మాడుగుల మండలం చింతలగూడెంలో దారుణం జరిగింది. చింతలగూడెం గ్రామానికి చెందిన కోట రాజలింగం-రజిత కుమార్తె కోట కళ్యాణి(19) పాలిటెక్నిక్ పూర్తిచేసి ప్రస్తుతం ఇంటివద్ద ఉంటుంది..
ఏపీలోని అనకాపల్లి జిల్లాలో తొమ్మిదో తరగతి విద్యార్థినిని దారుణంగా హతమార్చిన నిందితుడు సురేశ్ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. రాంబిల్లి మండలం కొప్పగుండుపాలెం శివారులో అతడి మృతదేహాన్ని పోలీసులు గుర్తించారు. ఈ నెల 6న సురేశ్ దర్శిని ఇంటికి వెళ్లి కత్తితో దారుణంగా చంపేశాడు. ప్రేమ పేరుతో వేధించడంతో దర్శిని కుటుంబసభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో సురేశ్ జైలుకు వెళ్లాడు. ఆ కోపంతోనే హతమార్చినట్లు తెలుస్తోంది. అనకాపల్లి జిల్లా రాంబిల్లి మండలం కొప్పుగుండుపాలెంనకు చెందిన బద్ది దర్శిని రాంబిల్లి జిల్లా…
కర్నాటకలో రైతుల ఆత్మహత్యలు ఎక్కువగా నమోదయ్యాయి. గత 15 నెలల వ్యవధిలో 1,182 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారని రాష్ట్ర రెవెన్యూ శాఖ తెలిపింది. ఈ ఆత్మహత్యలకు ప్రధాన కారణాలు తీవ్రమైన కరువు, పంట నష్టం మరియు విపరీతమైన అప్పులు అని రెవెన్యూ శాఖ పేర్కొంది.
ఓ యువకుడు సెల్‌ఫోన్ కొనివ్వలేదని ఆత్మహత్య చేసుకున్న ఘటన ఆదిలాబాద్ జిల్లాలో చోటుచేసుకుంది. తలమడుగు మండలంలోని ఉమ్రి గ్రామ శివారులో చెట్టుకు ఉరేసుకొని మేస్త్రం కృష్ణ అనే యువకుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు.
రాష్ట్ర ప్రభుత్వంపై మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్ రావు తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. రాష్ట్రంలో రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నా ప్రభుత్వం పట్టించుకోకపోవడం పట్ల ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో రైతుల ఆత్మహత్యలు, ఆత్మహత్యాయత్నాలు నిత్యకృత్యం అయినా కాంగ్రెస్ ప్రభుత్వానికి చీమకుట్టినట్లైనా లేకపోవడం దుర్మార్గం అని ఆరోపించారు. ఖమ్మం జిల్లాలో మొన్న ఒక రైతు పురుగుల మందు తాగి ప్రాణాలు వదిలగా.. తన సమస్యకు పరిష్కారం చూపడం లేదనే ఆవేదనతో నిన్న సీఎం సొంత జిల్లాలోనే…
నెల్లూరులోని ప్రభుత్వ వైద్య కళాశాల భవనం నుంచి దూకి ఒక వైద్యురాలు ఆత్మహత్యకు పాల్పడింది. చేజర్ల మండలం చిత్తలూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో వైద్యురాలిగా పనిచేస్తున్న జ్యోతి ... క్యాన్సర్ కు సంబంధించి జిల్లా వ్యాప్తంగా వైద్యులకు ఇస్తున్న శిక్షణ కార్యక్రమానికి హాజరైంది.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వరావుపేట ఎస్సై శ్రీరాముల శ్రీనివాస్ పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. నిన్న(ఆదివారం) ఉదయం సర్వీస్ రివాల్వర్‌ను ఇంటి వద్ద వదిలేసి అశ్వరావుపేట నుంచి మహబూబాబాద్‌కు వెళ్లి ఆత్మహత్యాయత్నం చేశారు.
కోటాలో మరో ఆత్మహత్య ఉదంతం వెలుగు చూసింది. బీహార్‌లోని భాగల్‌పూర్‌కు చెందిన హర్షిత్ అగర్వాల్ గురువారం ఆత్మహత్య చేసుకున్నాడు. అతను నీట్‌కు సిద్ధమవుతున్నాడు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని మార్చురీలో ఉంచారు. ఆత్మహత్యకు పాల్పడిన విద్యార్థి గదిలో నుంచి ఎలాంటి సూసైడ్ నోట్ లభ్యం కాలేదని పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై విద్యార్థి కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. ఈ ఏడాది కోటాలో 12 మంది విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్నారు.…