యూపీలోని ఆగ్రాలో ఓ సంచలన కేసు వెలుగులోకి వచ్చింది. పోలీసుల వేధింపులతో విసిగిపోయిన ఓ యువకుడు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన బర్హాన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని రూపధాను గ్రామంలో చోటుచేసుకుంది. సమాచారం అందుకున్న ఏసీపీ డా.సుకన్య శర్మ, బర్హాన్ పోలీస్ స్టేషన్ సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని విచారణ ప్రారంభించారు. మృతదేహాన్ని అదుపులోకి తీసుకుని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు.
యూపీలోని హమీర్‌పూర్‌లో ఓ సంచలన కేసు వెలుగులోకి వచ్చింది. ప్రేమికుడి చేతిలో మోసపోయిన ఓ మహిళ ఆత్మహత్య చేసుకుంది. తనతో పాటు తన ఇద్దరు పిల్లలకు విషమిచ్చి సూసైడ్ చేసుకుంది. ఒక్కసారి ముగ్గురు మృతి చెందడంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు.. సంఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు ప్రారంభించారు. మృతదేహాలను అదుపులోకి తీసుకుని పోస్టుమార్టంకు తరలించారు. ఈ ఘటన ముస్కరా పోలీస్ స్టేషన్ పరిధిలోని బంద్వా గ్రామంలో చోటుచేసుకుంది.
ఢిల్లీలో ఓ దపంతుల జంట వేర్వేరు చోట్ల ఆత్మహత్యకు పాల్పడింది. మృతులు ఈశాన్య రాష్ట్రమైన అస్సాంకు చెందినవారిగా గుర్తించారు. ఈ మేరకు పోలీసులు శనివారం సమాచారం అందించారు. జుమీ దాస్, ఆమె భర్త భాస్కర్ దేకా (27)గా పోలీసులు తెలిపారు. కాగా.. ఝుమీ దాస్ హౌస్ కీపింగ్ సిబ్బందిగా పనిచేసింది. భర్త చాందినీ చౌక్ ప్రాంతంలోని ఓమాక్స్ మాల్‌లో సెక్యూరిటీ గార్డుగా పనిచేసే వాడు.
యూపీలోని సంత్ కబీర్ నగర్ లో ఓ సంచలన ఘటన వెలుగులోకి వచ్చింది. అత్యాచారం ఆరోపణలపై జైలు నుంచి వచ్చిన ఓ యువకుడు.. తనపై సామూహిక అత్యాచారం చేశాడని కేసు నమోదు చేయాలంటూ ఓ యువతి గురువారం ఎస్పీ కార్యాలయ ఆవరణలో ఆత్మహత్యకు యత్నించింది. తన వెంట తీసుకొచ్చుకున్న పెట్రోల్ ను ఒంటిపై పోసుకుంది. ఈ క్రమంలో మహిళా పోలీసులు వెంటనే అడ్డుకున్నారు. యువకుడిపై కేసు నమోదు చేస్తామని చెప్పడంతో యువతి శాంతించింది.
టీమిండియా మాజీ క్రికెటర్ డేవిడ్ జాన్సన్ ఆత్మహత్య చేసుకున్నాడు. బిల్డింగ్ నాలుగో అంతస్తు నుంచి దూకి సూసైడ్ కు పాల్పడ్డాడు. డేవిడ్ జాన్సన్ భారత్ తరుఫున రెండు టెస్ట్ మ్యాచ్లు ఆడాడు. అతను 1996లో ఇండియా తరుఫున అరంగేట్రం చేశాడు. అదే సంవత్సరంలో తన రెండవ టెస్ట్ మ్యాచ్ ఆడాడు. ఆ తర్వాత జాన్సన్ కు అవకాశం రాలేదు. కాగా.. డేవిడ్ జాన్సన్ మృతి పట్ల గౌతం గంభీర్, అనిల్ కుంబ్లేతో సహా పలువురు టీమిండియా మాజీ…
మొబైల్ ఫోన్లు వచ్చాక ప్రజల జీవన విధానమే మారిపోయింది. అసలు ఫోన్ లేకుండా ఒక్కరోజు కూడా ఉండలేని పరిస్థితి ఏర్పడింది. ఒక రోజులో కొన్ని గంటల పాటు ఆ ఫోన్లు చూడటానికే సమయాన్ని వినియోగిస్తున్నారు నెటీజన్లు. ప్రస్తుతం కొంతమంది చిన్నపిల్లలైతే ఆ ఫోన్లో వీడియోలు చూపించనిదే అన్నం తినడం లేదు. మరికొంతమంది టీనేజీ యువత ఫోన్ కొనివ్వాలంటూ తల్లిదండ్రులపై మారాం చేస్తుంటారు. అయితే ములుగు జిల్లా తాడ్వాయి మండలం భూపతిపూర్లో ప్రాంతంలో విషాదం ఓ మైనర్ యువతి…
నిండు నూరేళ్లు బతకాల్సిన బాలిక 13 ఏళ్లకే కనుమరుగైంది. ఏం కష్టమొచ్చిందో తెలియదు కానీ.. కన్నవాళ్లకు కడుపు కోతను మిగిల్చింది. మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో ఓ బాలిక ఆత్మహత్య చేసుకుంది. మంగళవారం రోజున 14వ అంతస్తు నుంచి దూకి సూసైడ్ కు పాల్పడింది. కాగా.. బాలిక 7వ తరగతి చదువుతుంది. అయితే ఉదయం పాఠశాలకు వెళ్లేందుకు అని బయటికొచ్చి.. స్కూల్ బస్సు రాకపోవడంతో మళ్లీ ఇంట్లోకి వెళ్లింది.
భార్య చనిపోవడంతో ఐపీఎస్ అధికారి ఆత్మహత్య చేసుకున్న ఘటన వెలుగులోకి వచ్చింది. ఈ విషయాన్ని అస్సాం డీజీపీ జీపీ సింగ్ స్వయంగా ఎక్స్‌లో పోస్ట్ చేయడం ద్వారా ధృవీకరించారు. ఆయన తన పోస్ట్‌లో.. 'ఇది దురదృష్టకర సంఘటన. అస్సాం హోం, పొలిటికల్ సెక్రటరీ షిలాదిత్య చెటియా ఈరోజు సాయంత్రం ప్రాణాలు తీసుకున్నారు. అతను 2009 బ్యాచ్ ఐపీఎస్ అధికారి. చాలా కాలంగా క్యాన్సర్‌తో పోరాడుతున్న తన భార్య మరణించిన నిమిషాల తర్వాత అతను ఈ చర్య తీసుకున్నాడు.…
బీటెక్ విద్యార్థి రైలు కిందపడి బలవన్మరణానికి పాల్పడిన ఘటన సోమవారం ఆదోని పట్టణంలో వెలుగు చూసింది. రైల్వే పోలీసులు, విద్యార్థి తండ్రి తెలిపిన వివరాల మేరకు.. ఆదోని మండలం పెసలబండ గ్రామానికి చెందిన గొల్ల వెంకటేశ్వర్లు, నలినీ దంపతులకు కుమారుడు, కుమార్తె ఉన్నారు. వీరి కుమారుడు సలేంద్ర ఈశ్వర్ (20) సెలవులు కావడంతో ఇంటికి వచ్చాడు. ఈ నెల 16వ తేదీ రాత్రి 7.30 గంటల సమయంలో ఈశ్వర్ బయటకు వెళ్లి వస్తానని చెప్పి వెళ్లిపోయాడన్నారు. రాత్రి…
ఎవరైనా ఆప్తుల్ని కోల్పోతే.. ఆ కుటుంబంలో ఎంతో బాధ, దు:ఖం ఉంటుంది. కొన్ని రోజులు పాటు ఆ ఇల్లంతా విషాదంలో ఉంటుంది. ఇక బంధువులు, స్నేహితులు ఎవరైనా పరామర్శకు వస్తుంటే.. మళ్లీ మళ్లీ జ్ఞాపకం చేసుకుంటూ కన్నీళ్లు పెట్టుకుంటారు.