ప్రైవేటు టెలీకాం సంస్థలు ఆయా సేవలతో దూసుకుపోతున్నాయి. కస్టమర్లకు తగ్గట్టుగా సేవలు అందిస్తూ మన్నలు పొందుతున్నాయి. తాజాగా ప్రభుత్వరంగ టెలికాం సంస్థ బీఎస్‌ఎన్‌ఎల్ కూడా సరికొత్త సేవలను ప్రారంభించింది. ఫైబర్ యూజర్ల కోసం ఐఎఫ్‌టీవీ పేరిట కొత్త సేవలను ప్రారంభించింది
ప్రముఖ వీడియో స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్ అమెజాన్ ప్రైమ్ వీడియో కీలక నిర్ణయం తీసుకుంది. ఆదాయాన్ని పెంచుకొనేందుకు సిద్ధమైంది. ఇప్పటివరకు తన స్ట్రీమింగ్ వేదికగా ఎటువంటి యాడ్స్ అందించని ప్లాట్‌ఫామ్ త్వరలోనే ప్రకటనలు ఇచ్చేందుకు చూస్తోంది.
సినిమా థియేటర్లకు వెళ్లి సినిమాలు చేసే వారి సంఖ్య క్రమంగా తగ్గుతోంది. ప్రేక్షకులు సినిమా థియేటర్ వరకు రావడం లేదని భావించిన వ్యాపార సంస్థలు.. వారి వద్దకే ఎంటర్‌టేన్‌మెంట్‌ను తీసుకెళ్లాలని భావించాయి.
క్రికెట్ అభిమానులకు ఓ OTT సంస్థ శుభవార్త తెలిపింది. జియో బాటలోనే నడిచేందుకు రెడీ అయింది. దీంతో క్రికెట్ ఫ్యాన్స్ ఇంకా పండుగ చేసుకోవచ్చు. ఇప్పటికే ఐపీఎల్ లో ఫ్రీగా మ్యాచ్ లు చూసుకునేలా చేసిన జియో తరహాలోనే.. ఆ సంస్థ కూడా అలా వెళ్లడానికి ముందడుగు వేస్తుంది. ఇంతకీ ఆ ఓటీటీ సంస్థ ఏదంటారా..? మీరు ఇంతకు ముందు వాడే ఉంటారు. అదేనండీ డీస్నీ హాట్ స్టార్(Disney Hotstar).
పెరుగుట విరుగుట కొరకే అంటూ ఉంటారు. అన్ని సందర్భాల్లో కాదు కానీ, కొన్ని విషయాల్లో ఇది నిజమవుతూ ఉంటుంది. స్ట్రీమింగ్ జెయింట్ అనిపించుకున్న నెట్ ఫ్లిక్స్ కు ఈ యేడాది తొలి క్వార్టర్ లోనే షాక్ తగిలినట్టయింది. ఎందుకంటే నెట్ ఫ్లిక్స్ లెక్కలు చూస్తే ఈ యేడాది మొదటి మూడు నెలల్లోనే లక్షలాది మంది సబ్ స్క్రైబర్స్ తగ్గినట్టు తేలింది. అయితే భారతదేశం, మరికొన్ని ఆసియా దేశాల్లో మాత్రం నెట్ ఫ్లిక్స్ దే హవా అని తెలుస్తోంది.…