Disney+ Hotstar: హాట్‌స్టార్‌కు గుడ్‌బై చెబుతున్న సబ్‌స్క్రైబర్లు .. 1.25 కోట్ల మంది గుడ్‌బై
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Disney+ Hotstar: సినిమా థియేటర్లకు వెళ్లి సినిమాలు చేసే వారి సంఖ్య క్రమంగా తగ్గుతోంది. ప్రేక్షకులు సినిమా థియేటర్ వరకు రావడం లేదని భావించిన వ్యాపార సంస్థలు.. వారి వద్దకే ఎంటర్‌టేన్‌మెంట్‌ను తీసుకెళ్లాలని భావించాయి. భావించిందే తడువుగా Over-The-Top(ఓటీటీ)లను ప్రారంభించాయి. అందులో భాగంగానే డిస్నీప్లస్ హాట్ స్టార్, ఆహా, నెట్‌ఫ్లెక్స్, సన్ నెట్, జీ5, అమెజాన్ ప్రైమ్ వీడియో వంటి ఓటీటీ సంస్థలు వచ్చాయి. ఇపుడు కొత్తగా రిలీజ్ అయిన సినిమాలు నెల రోజుల నుంచి 6 నెలలోపే.. ఓటీటీల్లోకి వచ్చేస్తున్నాయి. కొన్ని చిన్న బడ్జెట్ సినిమాలు అయితే థియేటర్లలో విడుదల చేయడానికి బడ్జెట్ లేకపోవడంతో.. ఓటీటీ వేదికగా రిలీజ్ అవుతున్నాయి. మరికొన్ని రియాలిటీ షోలు కూడా ఓటీటీల ద్వారా కొనసాగుతున్నాయి. అంత ప్రాధాన్యత ఉన్న ఓటీటీల్లో డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ ఒకటి, అయితే ఈ మధ్య కాలంలో డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ నుంచి వినియోగదారులు తమ సబ్‌స్ర్కిప్షన్‌ను తొలగించుకుంటున్నారు. ఇప్పటి వరకు సుమారు 1.25 కోట్ల మంది సబ్‌స్క్రైబర్లు హాట్‌స్టార్ నుంచి తప్పుకున్నట్టు తెలిసింది. పాస్‌వర్డ్ షేరింగ్‌పై పరిమితులు తీసుకురావాలని భావిస్తున్నట్టు సంస్థ ప్రకటించిన నేపథ్యంలో సబ్‌స్క్రైబర్లు తప్పుకుంటున్నట్టు తెలుస్తోంది.
Read also: Chiranjeevi: సూపర్ స్టార్ హిట్ కొట్టేశాడు.. నెక్స్ట్ నువ్వే బాసూ
Also Read
- Double-Stack Container Train: భారతీయ రైల్వే చరిత్రలో కీలక మైలురాయి.. తొలిసారి డబుల్ స్టాక్ లాంగ్-హాల్ కంటైనర్ రైలు
- EPFO EEC 2026: ఉద్యోగులకు EPFO గుడ్‌న్యూస్.. అక్టోబర్ 31 వరకు ఛాన్స్.. మిస్ కావద్దు.!
- Food Inflation 2026: వంటగది బడ్జెట్‌కు బిగ్ షాక్.. వంట నూనె, పప్పులు, ఉల్లి, చక్కెర.. ధరలు పెరగడానికి అసలు కారణాలివే!
- Cheque Book New Rules 2026: చెక్‌బుక్ కొత్త రూల్స్.. మీ చెక్‌పై ఈ సెక్యూరిటీ కోడ్ ఉందా? చెక్ చేసుకోండి!
డిస్నీప్లస్ హాట్‌స్టార్ ఓటీటీ ప్లాట్‌ఫాం నుంచి మూడో త్రైమాసికంలో కోటి 25 లక్షల చందాదారులు తప్పుకున్నారు. కొద్ది రోజుల క్రితం పాస్‌వర్డ్ షేరింగ్‌పై పరిమితులు తీసుకురానున్నట్లు ఓటీటీ సంస్థ నుంచి వార్తలు వచ్చాయి. ఈ కారణంతోనే ఎక్కువ మంది ఓటీటీ నుంచి వీడిపోతున్నట్టు సమాచారం. ఎక్కువ సంఖ్యలో చందాదారులను కోల్పోయి 460 మిలియన్ల నికర నష్టాన్ని డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ నమోదు చేసుకుంది. గత త్రైమాసికంలో అంతర్జాతీయంగా 7.4 శాతం మంది చందాదారులను కోల్పోగా.. రెండో త్రైమాసికంలో 157.8 మిలియన్లగా ఉన్న యూజర్ల సంఖ్య మూడో త్రైమాసికం నాటికి 146.1 మిలియన్లకు పడిపోయింది. తగ్గిన వారిలో అమెరికా (US), కెనడా (Canada)లో ఉన్న వారే దాదాపు మూడు లక్షల మంది ఉన్నారు. తమ స్ట్రీమింగ్ సేవల్లో యాడ్ సపోర్ట్‌డ్ వెర్షన్‌ను యూరోప్, కెనడా, అమెరికాల్లో తొందరలో అందుబాటులోకి తీసుకురానున్నట్లు డిస్నీ ఇప్పటికే ప్రకటించింది. తమ వ్యాపారాన్ని లాభదాయకంగా మార్చేందుకు సహాయపడే బహుళ మార్కెట్ల కోసం వేచిచూస్తున్నామని.. తక్కువ పెట్టుబడితో మెరుగైన సేవలు అందించే మార్కెట్లు ఉన్నాయని డిస్నీప్లస్ హాట్‌స్టార్ సీఈఓ బాబ్ ఇగర్ తెలిపారు. ఓటీటీ ఫ్లాట్ ఫామ్ తీసుకొచ్చిన యాడ్ ఫ్రీ డిస్నీ (ad-free Disney) ప్లాన్‌తో పాటు హులు ప్లాన్ (Hulu plans) ధరల పెంపుతో కంపెనీ తిరిగి లాభదాయకంగా మారుతుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. అయితే త్వరలోనే తెలుగులో బిగ్‌బాస్ రియాలిటీ షో ప్రారంభం కానున్న నేపథ్యంలో .. డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ సబ్‌స్క్రైబర్లు పెరిగే అవకాశం ఉంటుందని కూడా సంస్థ రీజియన్ అధికారులు చెబుతున్నారు.
తాజావార్తలు
-
Drishyam 4: జార్జ్‌కుట్టి కథకు మరో ట్విస్ట్.. ‘దృశ్యం 4’ను అధికారికంగా ప్రకటించిన మేకర్స్!
-
Uttar Pradesh: కాంగ్రెస్ ఎంపీ ఇంట్లో రాజకీయ చిచ్చు.. కుమార్తెపై అల్లుడి దాడి!
-
Heavy Rain Alert : ఏపీకి భారీ వర్ష ముప్పు.. ఉత్తరాంధ్రకు అలర్ట్
-
Niu Lai Box Office: స్టార్లు లేరు.. భారీ బడ్జెట్ లేదు.. అయినా రూ.కోట్ల వసూళ్లు! ఈ చిన్న సినిమా రచ్చ మామూలుగా లేదుగా..
-
Bangladesh: హసీనా ఎఫెక్ట్.. బంగ్లా ప్రధాని భారత్ పర్యటనపై తర్జనభర్జన!
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi: 8 పరుగులకే ఔట్.. అరంగేట్రంలోనే వైభవ్ సూర్యవంశీ అట్టర్ ఫ్లాఫ్!
-
Home Remedies: వర్షాకాలంలో ఇంట్లో జెర్రులు, దోమలు, చీమలు, నల్లులకు చెక్ పెట్టే చిట్కాలు ఇవే!
-
Home Safety Tips: పాములను ఇంట్లోకి రాకుండా తరిమికొట్టే చిట్కాలు ఇవే.. ఈ జాగ్రత్తలు తీసుకోండి..
-
Maharashtra: “ఇది కదా విశ్వాసం అంటే”.. యజమానులు తిరిగిరారని తెలియక.. తిండి, నీళ్లు మానేసిన పెంపుడు కుక్క
-
Karnataka: పెళ్లి కొడుకు రాహుల్ గాంధీ ఫ్యాన్.. పెళ్లి క్యాన్సల్ చేసిన యువతి? షాకింగ్ కారణం!