బీహార్‌లో గంగా నది ఉగ్రరూపం దాల్చింది. గంగా తీరం వెంబడి ఉన్న దాదాపు 12 జిల్లాలు వరద పరిస్థితులను ఎదుర్కొంటున్నాయి. లోతట్టు ప్రాంతాల్లో 13.5 లక్షల మంది ప్రజలు ప్రభావితమయ్యారు. 376 గ్రామ పంచాయతీలు ప్రభావితమయ్యాయి. చాలా మంది నివాసితులు శిబిరాలకు తరలించారు.
ఉత్తరప్రదేశ్‌లో భారీ వర్షాల ప్రభావంతో హిండన్ నది నీటిమట్టం పెరిగింది. వరదతో నోయిడాలోని చాలా ప్రాంతాలు నీట మునిగాయి. ఎకోటెక్ 3 సమీపంలోని పార్కింగ్ చేసిన వంద కార్లు నీటమునిగాయి. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
దేశ రాజధాని ఢిల్లీలో భారీ వర్షం కురుస్తుంది. ఇవాళ ఉదయం నుంచి ఢిల్లీలో ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తోంది. శనివారం కురిసిన భారీ వర్షాల కారణంగా ఢిల్లీలో పలు ప్రాంతాల్లో నీటి ఎద్దడిని చూపుతున్నాయి. భారీ వర్షానికి లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. పలు ప్రాంతాల్లో నీరు నిలిచిపోయింది. 56 రోడ్లు నీట మునిగాయి.