Student Suicide: మియాపూర్ లో విద్యార్థి ఆత్మహత్య.. అనుమానం వ్యక్తం చేసిన తల్లిదండ్రులు..
- మియాపూర్ ఓ కాలేజీ లో విద్యార్థి ఆత్మహత్య కలకలం..
- నిన్న రాత్రి హాస్టల్ గదిలో ఊరి వేసుకొని ఆత్మహత్య కు పాల్పడ్డ విద్యార్థి..
- విద్యార్థి మృతి పై పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్న విద్యార్థి తల్లి తండ్రులు..
- కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్న మియాపూర్ పోలీసులు....
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Student Suicide: విద్యాబుద్ధులు నేర్చుకునేందుకు కాలేజీలకు వెళ్లే విద్యార్థులు విగత జీవులుగా మారి తల్లిదండ్రులకు కన్నీరు మిగిలిస్తున్నారు. యాజమాన్యాల చదువుల ఒత్తిడి, మార్కుల టెన్షన్‌తో విద్యార్థులు వరుసగా ఆత్మహత్యలకు పాల్పడుతున్నాయి. వివరాల్లోకి వెళితే.. విజయవాడకు చెందిన కౌశిక్ రాఘవ (17) మియాపూర్ లోని కల్వరి టెంపుల్ వద్ద ఉన్న ఓ జూనియర్ కళాశాలలో MPC మొదటి సంవత్సరం చదువుతున్నాడు. శుక్రవారం అర్ధరాత్రి తన హాస్టల్ గదిలో ఫ్యాన్‌కు ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. అయితే విద్యార్థిని ఆత్మహత్య విషయాన్ని కాలేజీ యాజమాన్యం గోప్యంగా ఉంచింది. మృతదేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం గాంధీ హాస్పిటల్ కు తరలించారు. విషయం తెలుసుకున్న విద్యార్థి తల్లిదండ్రులు, బంధువులు శ్రీ చైతన్య కళాశాలకు చేరుకుని నిరసన తెలిపారు. విద్యార్థి మృతి పై విద్యార్థి తల్లి తండ్రులు పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. శ్రీ చైతన్య కళాశాలలో విద్యార్థులపై తీవ్ర ఒత్తిడి తెస్తున్నారని, మానసిక వేధింపుల వల్లే కౌశిక్ రాఘవ ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. వెంటనే కాలేజీ యాజమాన్యంపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. మియాపూర్ పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. విద్యార్థి ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది.
Nude Video Call: పోచారం ఐటీ కారిడార్ లో విద్యార్థికి న్యూడ్ వీడియో కాల్ కలకలం..
Also Read
- MeeSeva : మీసేవ సర్టిఫికెట్లలో కొత్త మార్పు.. ఇక లామినేషన్ అవసరం లేదు
- Telangana: రష్యా-ఉక్రెయిన్ యుద్ధంలో తెలంగాణ వాసి మృతి.. ప్రభుత్వం కీలక నిర్ణయం
- TG SAFE : హైవేపై హోటళ్లలో ఇదేం దారుణం.? పురుగుల మధ్య వంటలు, పలు హోటళ్లు సీజ్
- Osmania Hospital Protest: ఉస్మానియాలో జూడాల ఆందోళన.. ప్రభుత్వానికి 10 రోజుల డెడ్‌లైన్.!
తాజావార్తలు
-
Flydubai Hijacking Caseలో బిగ్ ట్విస్ట్.. ఇద్దరు పైలట్ల అరెస్టుతో పెరిగిన ఉత్కంఠ
-
Robot: షాకింగ్.. 16 ఏళ్ల బాలికపై రోబో లైంగిక వేధింపులు..
-
YS Jagan: మేయర్లు, మున్సిపల్ ఛైర్మన్ల ఎంపికపై జగన్ కసరత్తు.. 6 గంటల పాటు కీలక సమావేశం..
-
Ladakh: లడఖ్ భారత్‌లో అంతర్భాగం.. చైనాకు భారత్ స్ట్రాంగ్ కౌంటర్..
-
Prabhas: మళ్ళీ ప్రభాస్‌తో మూవీ.. కన్మర్మ్ చేసిన టీజీ విశ్వప్రసాద్
ట్రెండింగ్
-
Viral : స్వీట్ బాక్స్ అడిగితే రూ.కోట్ల ఆర్డర్లు.. చివరకు ఇల్లు ఖాళీ చేసిన ఇన్ఫ్లుయెన్సర్!
-
200MP కెమెరా, Hasselblad లెన్స్ తో OPPO Find X10 సిరీస్.. ఇండియాలో లాంచ్ అప్పుడే.!
-
Production No.3: పాన్ ఇండియా లెవెల్ లో ఆది సాయికుమార్ కొత్త సినిమా.. భయపెట్టే పోస్టర్‌తో అనౌన్స్మెంట్.!
-
Kitchen Cleaning Tips: కిచెన్‌లో జిడ్డు పేరుకుపోతోందా? ఈ సింపుల్ చిట్కాలతో సులభంగా నివారించండి!
-
Sarah Dambanevana: క్రికెట్లో విషాదం.. మాజీ క్రికెటర్, అంతర్జాతీయ అంపైర్ సారా కన్నుమూత.!