ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది.. ఘాట్ రూట్లలో కూడా స్త్రీ శక్తి పథకం వర్తింపు చెయ్యాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశించారు.. స్త్రీశక్తి ఉచిత బస్సు పథకానికి అద్భుతమైన రెస్పాన్స్ వస్తుందని గుర్తించారు.. సోమవారం ఒక్క రోజే 18 లక్షల మంది ఉచిత ప్రయాణాలు చేశారు.. జీరో ఫేర్ టికెట్ ద్వారా మహిళలకు రూ.7 కోట్లకు పైగా ఆదా అయినట్టు ఆర్టీసీ లెక్కలు చెబుతున్నాయి.. 4 రోజుల్లో 47 లక్షల మంది ప్రయాణం…
APSRTC: ఏపీఎస్ఆర్టీసీ స్త్రీశక్తి పథకం విజయవంతం చేయడంలో భాగంగా.. సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ తీసుకున్న పలు కీలక నిర్ణయాలను ఆర్టీసీ ఎంప్లాయీస్ యూనియన్ నాయకులు స్వాగతించారు. ఈ నిర్ణయాలు ఉద్యోగుల ఆర్థికాభివృద్ధి, ఉత్సాహం పెంపుదల దిశగా దోహదం చేస్తాయని వారు తెలిపారు. స్త్రీశక్తి పథకం విజయవంతం కోసం సంపూర్ణ సహకారం అందిస్తామని ఆర్టీసీ ఇ.యూ రాష్ట్ర అధ్యక్షులు పలిశెట్టి దామోదరరావు స్పష్టం చేశారు. ఇకపోతే ఆర్టీసీ ఉద్యోగుల కోసం తీసుకున్న ముఖ్య నిర్ణయాలు ఈ విధంగా ఉన్నాయి.…
స్త్రీ శక్తి పథకానికి శ్రీకారం చుట్టింది కూటమి ప్రభుత్వం.. ఈ సందర్భంగా బస్సులో సరదా సంభాషణ ఇప్పుడు వైరల్‌గా మారిపోయింది.. బస్సు ఎక్కగానే డబ్బులు ఇచ్చి టికెట్ తీసుకున్నారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు.. అయితే, డబ్బులు ఇచ్చి టికెట్ తీసుకోబోతున్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ను ఆపిన మంత్రి నారా లోకేష్ .. నా నియోజకవర్గానికి వచ్చారు.. నలుగురికి నేనే టికెట్ తీస్తాను అన్నా.. అంటూ పవన్‌ను ఆపారు లోకేష్.. తాను డబ్బులు ఇచ్చి…
Minister Anagani: మంత్రి అనగాని సత్యప్రసాద్ ఎన్టీవీతో మాట్లాడుతూ.. స్త్రీ శక్తి పథకం కారణంగా ఇవాళ విడుదల చేయాల్సిన కొత్త పాస్‌బుక్‌ల ఆవిష్కరణ వాయిదా పడిందని చెప్పుకొచ్చారు. వారం లేదా 10 రోజుల లోపులో ముఖ్యమంత్రి చంద్రబాబు చేతుల మీదుగా ఈ పాస్‌బుక్‌లను ఆవిష్కరిస్తామని ఆయన చెప్పుకొచ్చారు.