విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని ప్రైవేట్ పరం చేయకుండా కార్మికులు చేస్తున్న దీక్షకు జనసేనాని పవన్ కళ్యాణ్ మద్దతు పలికారు. కూర్మన్న పాలెంలోని బహిరంగ సభలోపవన్ మాట్లాడారు. నా సభలకు జనం వస్తారు. కానీ ఓట్లు మాత్రం వైసీపీకి వేస్తారన్నారు. నాకు ఒక ఎంపీ కూడా లేడు, ఉన్న ఒక్క ఎమ్మెల్యేను వైసీపీ వాళ్లు పట్టుకెళ్లారు. అయినా ప్రజల సమస్యల కోసం నిలబడేది మేమేనని ఆయన స్పష్టం చేశారు. స్టీల్ ప్లాంట్ కోసం వైసీపీ లేఖలు రాసిందని చెబుతుంది.…
జనసేన అధినేత పవన్ కల్యాణ్.. విశాఖ పర్యటన ఖరారైంది… జనసేనాని పర్యటనకు సంబంధించిన షెడ్యూల్‌ను ప్రకటించింది ఆ పార్టీ.. ఉక్కు పరిరక్షణ పోరాట ఉద్యమానికి సంఘీభావం తెలపనున్న పవన్ కల్యాణ్.. ఈనెల 31 మధ్యాహ్నం ఉక్కు పరిరక్షణ సభలో పాల్గొంటారని వెల్లడించింది.. కాగా, విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై కేంద్రం వడివడిగా అడుగులు వేస్తుండగా… విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అంటూ సాధించుకున్న స్టీల్ ప్లాంట్‌ను వదులుకోవడానికి సిద్ధంగాలేని కార్మిక, ప్రజాసంఘాలు ఆందోళన చేస్తూ వస్తున్నాయి.. వారికి…
మా లక్ష్యం ఒక్కటే స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ జరగకూడదు అన్నారు ఏపీ మంత్రి అవంతి శ్రీనివాస్‌రావు… స్టీల్ ప్లాంట్ పరిరక్షణ కోసం 64 ఏళ్ల వయస్సులో విజయసాయి రెడ్డి పాదయాత్ర చేశారు. 70 ఏళ్ల వయస్సులో గాజువాక ఎమ్మెల్యే కూడా నిర్వాసితుల కోసం పాదయాత్ర చేశారు.. సీఎం వైఎస్ జగన్ ఇప్పటికి 3 సార్లు ప్రధాని నరేంద్ర మోడీకి లేఖలు రాశారని గుర్తుచేశారు.. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా అసెంబ్లీలో తీర్మానం చేశామన్న ఆయన.. అయితే, ఢిల్లీలో…
పార్లమెంట్ లోపల, బయట విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా పోరాటం చేస్తామని ప్రకటించారు వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ లోక్‌సభ సభ్యులు మిథున్‌రెడ్డి… విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ ధర్నాకు సంఘీభావం తెలిపిన ఆయన.. పరిరక్షణ కమిటీ పోరాటంలో పాలు పంచుకుంటామని తెలిపారు.. వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అంశాన్ని పార్లమెంట్‌లో లేవనెత్తామని గుర్తుచేసిన ఆయన.. స్టీల్ ప్లాంట్ ఆంధ్రుల ఆత్మభిమానం అని పార్లమెంట్ లో స్పష్టం చేశామన్నారు.. ఇక, స్టీల్ ప్లాంట్‌కు గనులను కేంద్ర…
నెల్లూరు జిల్లాలో స్టీల్ ప్లాంట్ ఏర్పాటుకు సన్నాహాలు జరుగుతున్నాయి. జిందాల్ స్టీల్ ప్లాంటుకు 860 ఎకరాల కేటాయించారు. నెల్లూరు జిల్లా తమ్మినపట్నం- మోమిడి గ్రామాల పరిధిలో జిందాల్ స్టీల్ ప్లాంటుకు భూమి ఇచ్చారు. గతంలో కిన్నెటా పవర్ కు ఇచ్చిన భూ కేటాయింపులు రద్దు చేసి.. జిందాల్ స్టీల్సుకు కేటాయించారు. రూ. 7500 కోట్ల రూపాయలతో 11.6 మిలియన్ టన్నుల సామర్థ్యంతో స్టీల్ ప్లాంట్ నిర్మాణం చేయనుంది జిందాల్ స్టీల్స్. 2500 మందికి నేరుగా, మరో 15…
ఓవైపు విశాఖ స్టీల్‌ప్లాంట్ ప్రైవేటీకరణ వైపు వేగంగా అడుగులు పడుతున్నాయి.. మరోవైపు వివిధ రాజకీయ పార్టీలు, కార్మిక సంఘాలు.. స్టీల్ ప్లాంట్ పరిరక్షణ కోసం పెద్ద ఎత్తున ఉద్యమాన్ని నిర్వహిస్తున్నాయి.. ఈ తరుణంలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు ఆంధ్రప్రదేశ్ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు.. విశాఖ స్టీల్ ప్లాంట్ ను అమ్మనివ్వమని స్పష్టం చేసిన ఆయన.. అందరికి ఉద్యోగాలు ఉంటాయి.. స్టీల్ ప్లాంట్‌ను మరింత అభివృద్ధి చేస్తామని చెప్పుకొచ్చారు.. ఇప్పటి వరకు స్టీల్ ప్లాంట్ ను కాపాడుకుంటు…
విశాఖలో స్టీల్‌ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కార్మికులు పోరాటం చేస్తున్నారు. ఈ పోరాటానికి ఇప్పటికే వివిధ పార్టీలు మద్దతు తెలిపాయి. స్టీల్‌ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఉద్యమాన్ని మరింత ఉదృతం చేయాలని కార్మికులు నిర్ణయం తీసుకున్నారు. స్టీల్‌ప్లాంట్ కోసం పార్లమెంట్‌లో పోరాడాలని ఇవాళ ఎంపీలను కలిసి విజ్ఞప్తి చేయబోతున్నారు. ఇక, కార్మిక సంఘాలు చేస్తున్న నిరసనలకు, ఆందోళనలకు సీపీఐ మద్దతు తెలిపింది. ఇతర రాజకీయ పార్టీల మద్దతు కూడా కోరాలని కార్మిక సంఘాల జేఏసీ నిర్ణయం తీసుకుంది. స్టీల్ ప్లాంట్…
విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై ఆర్టీఐ ద్వారా సమాచారం ఇచ్చేందుకు కేంద్ర ఆర్ధిక శాఖ నిరాకరించింది. విశాఖ స్టీల్ ప్లాంట్ విషయమై ఆర్టీఐ కింద అడిగిన సమాచారాన్ని డిపార్ట్ మెంట్ ఆఫ్ ఇన్వెస్ట్ మెంట్ అండ్ పబ్లిక్ అసెట్ మేనేజ్మెంట్ నిరాకరించింది. ఆర్టీఐ కార్యకర్త ఇనుగంటి రవికుమార్ అడిగిన సమాచారాన్ని నిరాకరించిన కేంద్ర ఆర్ధికశాఖ… విశాఖ ఉక్కులో పెట్టుబడుల ఉపసంహరణ అంశం ఆర్ధిక రహస్యాల పరిధిలోకి వస్తుందని పేర్కొంది డీఐపిఏఎం. ఈ అంశంపై సీఎం జగన్ ,…
కరోనా విపత్కర కాలంలో రోజుకు 150 టన్నుల ఆక్సిజన్ ఉత్పత్తి చేసి దేశానికే ఊపిరి పోసింది విశాఖ ఉక్కు కర్మాగారం అని చంద్రబాబు తెలిపారు. వెయ్యి పడకలతో కొవిడ్ కేర్ సెంటర్ ఏర్పాటుకు కూడా ముందుకు వచ్చి ఎన్నో ప్రాణాలు కాపాడుతోంది.అటువంటి విశాఖ ఉక్కును కబళించాలని కొందరు వైసీపీ పెద్దలు కుట్రలు చేస్తున్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా 100 రోజులుగా దీక్షలు జరుగుతున్నాయి. దీనిపై పార్లమెంటులో ఒక్క మాటకూడా మాట్లాడని వైసీపీ, అసెంబ్లీలో తీర్మానం…
విశాఖ ఉక్కు దీక్ష నేటితో వంద రోజులు పూర్తి చేసుకుంది. ఈ సందర్బంగా నారా లోకేష్ స్పందించాడు. ట్విట్టర్ లో విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అంటూ గత 100 రోజులుగా పోరాటం చేస్తున్న కార్మికులకు ఉద్యమాభివందనలు. విశాఖ ఉక్కు ని తుక్కు రేటుకి కొట్టేసి కార్మికుల ఊపిరి తియ్యాలని వైస్ జగన్ కుట్రలు చేస్తుంటే దేశవ్యాప్తంగా అనేక రాష్ట్రాలకు ఆక్సిజన్ సరఫరా చేసి కరోనా రోగులకు..ఊపిరి పోశారు స్టీల్ ప్లాంట్ కార్మికులు. ఇప్పటికైనా రాష్ట్రంలో దొంగ…