విశాఖ ఉక్కు దీక్ష నేటితో వంద రోజులు పూర్తి చేసుకుంది. ఈ సందర్బంగా నారా లోకేష్ స్పందించాడు. ట్విట్టర్ లో విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అంటూ గత 100 రోజులుగా పోరాటం చేస్తున్న కార్మికులకు ఉద్యమాభివందనలు. విశాఖ ఉక్కు ని తుక్కు రేటుకి కొట్టేసి కార్మికుల ఊపిరి తియ్యాలని వైస్ జగన్ కుట్రలు చేస్తుంటే దేశవ్యాప్తంగా అనేక రాష్ట్రాలకు ఆక్సిజన్ సరఫరా చేసి కరోనా రోగులకు..ఊపిరి పోశారు స్టీల్ ప్లాంట్ కార్మికులు. ఇప్పటికైనా రాష్ట్రంలో దొంగ తీర్మానాలు, ఢిల్లీలో పాదసేవ మాని చిత్తశుద్ధితో ప్రైవేటీకరణకి వ్యతిరేకంగా వైకాపా ప్రభుత్వం పోరాడాలి. ప్రైవేటీకరణ నిర్ణయం వెనక్కి తీసుకునే వరకూ తెలుగుదేశం పార్టీ పోరాడుతూనే ఉంటుంది అని పేర్కొన్నారు.