విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని ప్రైవేట్ పరం చేయకుండా కార్మికులు చేస్తున్న దీక్షకు జనసేనాని పవన్ కళ్యాణ్ మద్దతు పలికారు. కూర్మన్న పాలెంలోని బహిరంగ సభలోపవన్ మాట్లాడారు. నా సభలకు జనం వస్తారు. కానీ ఓట్లు మాత్రం వైసీపీకి వేస్తారన్నారు. నాకు ఒక ఎంపీ కూడా లేడు, ఉన్న ఒక్క ఎమ్మెల్యేను వైసీపీ వాళ్లు పట్టుకెళ్లారు. అయినా ప్రజల సమస్యల కోసం నిలబడేది మేమేనని ఆయన స్పష్టం చేశారు. స్టీల్ ప్లాంట్ కోసం వైసీపీ లేఖలు రాసిందని చెబుతుంది. వైసీపీని నమ్మలేమని జనసేనాని అన్నారు.
మన ప్రయత్నం మనం చేయకుండా కేంద్రాన్ని తప్పుపట్టడం సరికాదన్నారు. కులాలకీ, వర్గాలకీ అతీతంగా స్టీల్ ఫ్లాంట్ కోసం ఉద్యమించాలన్నారు. కవి అయినా కళాకారుడైనా ప్రజల సమస్యల కోసం ఉద్యమించకుంటే వారి జీవితం వ్యర్థం అన్నారు. విశాఖఉక్కు- ఆంధ్రుల హక్కు అన్న నినాదం ఏపీలో ఎంతో భావోద్వేగాన్ని కలిగించిందని జనసేనాని అన్నారు.
స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ వార్త వినగానే నాకు బాధ కలిగించిందని జనసేనాని అన్నారు. వెంటనే అమిత్ షాకు వినతి పత్రం ఇచ్చామని తెలిపారు. ప్రజాబలం ఉంది కనుకనే అమిత్‌షా అపాయింట్ మెంట్ ఇచ్చారన్నారు. ఆంధ్రప్రదేశ్ ఎంపీలు ఎవ్వరూ ప్రజల సమస్యలపై పార్లమెంట్‌లో మాట్లాడరని అలాంటప్పుడు ఎలా సమస్యలు పరిష్కారం అవుతాయని ఆయన అన్నారు. వైజాగ్ స్టీల్ ప్లాంట్‌కు స్వంత గనులు లేవని దీని కోసం ఎవ్వరూ కోట్లాడలేదని పవన్ కళ్యాణ్ అన్నారు.