దక్షిణాది రాష్ట్రాల ప్రాంతీయ మండలి సమావేశంలో పాల్గొన్న ముఖ్యమంత్రి పలు కీలక అంశాలను ప్రస్తావించారు. తిరుపతిలోని తాజ్ హోటల్లో దక్షిణాది రాష్ట్రాల ప్రాంతీయ మండలి సమావేశం ఆదివారం జరిగింది. కేంద్ర హోంమంత్రి అమిత్‌షా, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైయస్.జగన్, కర్ణాటక సీఎం బసవరాజు బొమ్మై సహా లెఫ్టినెంట్ గవర్నర్లు, అడ్మినిస్ట్రేటర్లు, మంత్రులు, అధికారులు హాజరయ్యారు. ఏపీకి సంబంధించిన కీలక అంశాలను ఈ సమావేశంలో ప్రస్తావించారు సీఎం జగన్. సమావేశంలో విలువైన సమాచారాన్ని, తగిన సూచనలు, సలహాలు అందించిన కర్ణాటక…
పెట్రో ధరలు క్రమంగా పెరుగుతూ సామాన్యుడికి చుక్కలు చూపిస్తున్నాయి.. అంతర్జాతీయ పరిస్థితులతో రోజురోజుకూ పైకి ఎగబాకుతోన్న పెట్రో ధరలకు బ్రేక్‌లు వేయాలన్న ఉద్దేశంతో.. ఇప్పటికే లీటర్ పెట్రోల్‌పై రూ.5, లీటర్ డీజిల్‌పై రూ.10 చొప్పున ఎక్సైజ్ సుంకాన్ని తగ్గిస్తూ కేంద్రం కీలక నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే.. ఇక, కేంద్రం దారిలోనే మరికొన్ని రాష్ట్రాలకు అడుగులు వేస్తూ.. వాహనదారులకు ఊరట కలిగించేలా.. తమ పరిధిలోని వ్యాట్‌ను తగ్గిస్తూ శుభవార్త వినిపించాయి.. కేంద్రం నిర్ణయం వెలువడిన రోజు కొన్ని…
దీపావళి పండుగ వేళ కేంద్ర ప్రభుత్వం తీపి కబురు అందించింది. అంతర్జాతీయ మార్కెట్లో ధరలు ప్రతిరోజు పెరుగుతున్న వేళ ఉపశమనం కలిగించింది కేంద్రం. దీపావళి వేళ వినియోగదారులకు శుభవార్త చెప్పింది. పెట్రోల్, డీజిల్ పైన ఎక్సైజ్ సుంకాన్ని తగ్గిస్తున్నట్లు ప్రకటించింది. కేంద్రం పెట్రోల్, డీజిల్ పై ఎక్సైజ్ డ్యూటీ తగ్గించిన సంగతి తెలిసిందే. పెట్రోల్ పై 5, డీజిల్ పై 10 రూపాయలు తగ్గించడంతో ధరలు దిగివచ్చాయి. ఈ తగ్గింపు ధరలు గురువారం ఉదయం నుంచి అమలులోకి…
జీఎస్టీ పరిహారం బదులుగా రుణాలను విడుదల చేసింది కేంద్రం. రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు కలిపి 44 వేల కోట్లు రిలీజ్ చేసింది. ఈ ఆర్థిక సంవత్సరంలో ఇప్పటి వరకు 1.59 లక్షల కోట్లు విడుదల చేసింది కేంద్రం.కరోనా సెకండ్‌వేవ్, లాక్‌డౌన్‌తో రాష్ట్రాల ఆర్థిక వ్యవస్థ దెబ్బతిన్నది. సగానికి సగం ఆదాయం పడిపోయింది. ఆ సంక్షోభం నుంచి బయటపడేందుకు రాష్ట్రాలు తీవ్రంగా ప్రయత్నిస్తున్నాయి. ఆదాయ మార్గాలపై దృష్టి పెట్టాయ్. ఐతే రాష్ట్రాలకు ఊతం ఇచ్చేందుకు ముందుకొచ్చింది కేంద్రం.…
దేశంలో కరోనా వ్యాప్తి ఆగడం లేదు. రోజుకు 40వేలకు పైగా కేసులు నమోదవుతున్నాయి. ముఖ్యంగా కేరళలో వైరస్ తీవ్రత నియంత్రణలోకి రావడం లేదు. గత వారంలో దేశవ్యాప్తంగా నమోదవుతున్న మొత్తం కేసుల్లో 68 శాతం ఒక్క కేరళలోనే ఉన్నట్లు కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. 24గంటల్లో దేశవ్యాప్తంగా 43వేల కేసులు వెలుగు చూడగా.. 338 మరణాలు సంభవించాయి. కరోనా వైరస్‌ను ఎదుర్కోవడంలో వ్యాక్సిన్లు సమర్థంగా పనిచేస్తున్నాయని కేంద్ర ప్రభుత్వం మరోసారి స్పష్టం చేసింది. కోవిడ్ మరణాలను నివారించడంలో 97శాతం…
కరోనా మహమ్మారిపై పోరాటంలో భాగంగా వ్యాక్సినేషన్‌పై ప్రత్యేకంగా దృష్టిసారించింది కేంద్రం… ఎప్పటికప్పుడు దీనిపై అన్ని రాష్ట్రాలను, కేంద్ర పాలిత ప్రాంతాలను అలెర్ట్ చేస్తూ.. కావాల్సిన డోసులు సరఫరా చేస్తోంది.. ఇక, వ్యాక్సినేషన్‌పై తాజాగా ఓ ప్రకటన చేసింది కేంద్ర వైద్య ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ.. ప్రస్తుతం వ్యాక్సినేషన్ శరవేగంగా సాగుతోందని తెలిపిన కేంద్రం.. ఇప్పటికే రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు 65,00,99,080 వ్యాక్సిన్ డోసులను పంపించాం.. త్వరలో మరో 1,20,95,700 వ్యాక్సిన్ డోసులు సమకూర్చనున్నట్టు ప్రకటించింది. అయితే,…
త్వరలోనే వాహనదారులు రిజిస్ట్రేషన్ ప్రక్రియలో ఎదుర్కొంటున్న ఇబ్బందులు తొలగిపోనున్నాయి.. దేశవ్యాప్తంగా కొత్తగా వాహనాల రిజిస్ట్రేషన్ ప్రక్రియకు కేంద్ర ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. ఈ ప్రక్రియతో.. రాష్ట్రాల మధ్య వాహనాల బదిలీ సులభతరం కానుంది.. ఇది అందుబాటులోకి వస్తే దేశవ్యాప్తంగా కొత్త వాహనాలకు భారత్ సిరీస్ (బీహెచ్ సిరీస్)తో రిజిస్ట్రేషన్లు చేస్తారు.. ఈ ప్రక్రియతో ఒక రాష్ట్రం నుంచి మరో రాష్ట్రానికి ఉద్యోగ రీత్యా బదిలీ అయ్యే ఉద్యోగులకు ప్రయోజనం కలగనుంది.. మరో రాష్ట్రానికి బదిలీ అయి వెళ్లగానే…
కరోనా సెకండ్ వేవ్ పూర్తిస్థాయిలో అదుపులోకి రానేలేదు.. అప్పుడే.. థర్డ్ వేవ్ ప్రారంభమైపోయిదంటూ ప్రపంచ ఆరోగ్యసంస్థ హెచ్చరిస్తోంది.. అయితే, కోవిడ్ మూడో ఉద్ధృతి సూచనలు కనిపిస్తుండడంతో కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. మెరుగైన కోవిడ్ చికిత్సలను అందించేందుకు వీలుగా ఏర్పాట్లు చేసుకోవాలని రాష్ట్రాలకు సూచించింది. భారత కొవిడ్-19 క్విక్ రెస్పాన్స్, ఆరోగ్య వ్యవస్థల సన్నద్ధత ప్యాకేజీ రెండో దశలో భాగంగా… 15 శాతం నిధులు అంటే 18 వందల 27 కోట్లను రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు విడుదల…
దేశంలో కరోనా బాధితుల సంఖ్య అనూహ్యంగా పెరుగుతోంది. ప్రతీరోజూ వేల సంఖ్యలో ఆసుపత్రుల్లో చేరుతున్నారు. చాలా మందికి కృత్రిమ ఆక్సిజన్ అందించాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. దీంతో ఆక్సిజన్ సిలిండర్లకు డిమాండ్ పెరిగింది. ఆసుపత్రుల్లో ఆక్సిజన్ దొరక్క రోగులు ఇబ్బందులు పడుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఆక్సిజన్ వృథాను అరికట్టడంపై దృష్టి పెట్టాలని రాష్ట్రాలను కోరింది కేంద్ర ప్రభుత్వం. ఆసుపత్రుల్లో అవసరాన్ని బట్టి ఆక్సిజన్ వినియోగించాలని సూచించింది. ప్రస్తుతం సరిపడా ఆక్సిజన్ అందుబాటులో ఉందని, ఎవరూ ముందస్తుగా నిల్వలు చేయకూడదని…
కూటి కోసం.. కూలి కోసం పట్టణంలో బ్రతుకుదామని వలస వచ్చిన కూలి జనాలకు.. పీడకల లాంటి రోజులు మళ్లీ గుర్తుకొస్తున్నాయి. కరోనా దెబ్బకు గతేడాది లాక్ డౌన్ సమయంలో చిందరవందరైన జీవితం, వారు పడిన కష్టం ఎవరూ మర్చిపోలేదు. సెకెండ్ వేవ్ విజృంభిస్తున్న సమయంలో పలు రాష్ట్రాల్లో మరోసారి లాక్ డౌన్, జనతా కర్ఫ్యూ దిశగా సాగుతుండటంతో…వలస జీవులకు మళ్లీ కష్టాలు వెతుక్కుంటూ వస్తున్నాయి. మహారాష్ట్ర సహా తెలుగు రాష్ట్రాల నుంచి తట్టాబుట్టా సర్దుకుని సొంతూళ్ల బాట…