రాజస్థాన్ సికర్ జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. ఖతు శ్యామ్ ఆలయంలో జరిగిన తొక్కిసలాటలో ముగ్గురు భక్తులు మరణించారు. మాసోత్సవాలు సందర్భంగా ఈ ఉదయం స్వామివారికి తొలిపూజలు నిర్వహించారు. అనంతరం అర్చకులు ఆలయ తలుపులు తెరవగా.. భక్తులు ఒక్కసారిగా గుడిలోకి దూసుకువచ్చారు. దీంతో తొక్కిసలాట జరిగింది. ఘటనలో ముగ్గురు మహిళలు అక్కడికక్కడే మరణించగా.. మరో ఏడుగురికి గాయాలయ్యాయి. క్షతగాత్రుల్ని జైపుర్ లోని ఆసుపత్రికి తరలించారు. ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు ప్రమాదానికి గల కారణాలు పై సీసీటీవీ…