కలియుగ ప్రత్యక్షదైవమైన తిరుమల శ్రీవారిని దర్శించుకోవడానికి నిత్యం వేలాదిమంది భక్తులు తరలివస్తుంటారు. ఇలా వచ్చే వారిలో కొంతమంది భక్తులు ముందే శ్రీవారి దర్శనం టికెట్లు బుక్ చేసుకుని వస్తే.. మరికొంతమంది భక్తులు నడకమార్గం ద్వారా తిరుమలకు చేరుకుని శ్రీవారి దర్శనం చేసుకుంటూ ఉంటారు. అలిపిరి నడక మార్గం నుంచే కాకుండా శ్రీవారి మెట్టు నుంచి కూడా తిరుమలకు చేరుకునే అవకాశం ఉంది.
శ్రీవారి మెట్టు మార్గంలో ఓ ప్రేమ జంట ఆత్మహత్యాయత్నం చేసింది.. ఇద్దరు ప్రేమికులు ఆత్మహత్యయత్నం చేయడంతో ఒక్కసారిగా తీవ్ర కలకలం రేగింది.. పెళ్లై.. ముగ్గురు పిల్లలు ఉన్న ఓ మహిళ.. ఓ యువకుడి ప్రేమలో పడింది. మూడు రోజుల క్రితం ఇద్దరు ఇంటి నుంచి పారిపోయారు. చంద్రగిరిలోని శ్రీవారిమెట్టు నడక మార్గం 450వ మెట్టు దగ్గరకు చేరుకున్నారు. ఇద్దరు కలిసి పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు.
కోవిడ్ అనంతరం కలియుగ వైకుంఠం తిరుమల భక్తులతో కిక్కిరిసిపోతోంది. ఈ నెల 11వ తేది నుంచి 17వ తేది వరకు భారీసంఖ్యలో భక్తులు తిరుమలకు తరలివస్తున్నారు. 7 రోజులలో 5.30 లక్షల మంది భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారని అదనపు ఈవో ధర్మారెడ్డి తెలిపారు. 24.38 లక్షల లడ్డూలు విక్రయిస్తే….హుండీ ద్వారా రూ.32.5 కోట్లు ఆదాయం లభించిందన్నారు. 46 వేల 419 వాహనాలలో భక్తులు తిరుమలకు తరలివచ్చారన్నారు. మే 1వ తేది నుంచి శ్రీవారి మెట్టు మార్గంలో భక్తులను…
అఖిలాండ కోటి బ్రహ్మాండనాయకుడైన ఆ శ్రీనివాసుడిని దర్శించుకోవడానికి దేశ,విదేశాల నుంచి భక్తులు తరలి వస్తుంటారు. వాహనాల్లో వెళ్లే వారు ఘాట్ రోడ్డు ద్వారా తిరుమలకు చేరుకుంటుండగా, నడక మార్గం భక్తులు అలిపిరి, శ్రీవారి మెట్టు ద్వారా శ్రీవారిని దర్శించుకుంటారు. అయితే అత్యంత ప్రాచీనమైన శ్రీవారి మెట్టు మార్గం భక్తులకు ఇప్పట్లో కష్టాలు తీరేలా లేవు. కలియుగ శ్రీనివాసుడు పై అపారమైన భక్తిభావంతో గోవిందనామాలు స్మరించుకుంటూ మొక్కుబడిగా మెట్టుమెట్టుకు నమస్కరించుకుంటూ వేల సంఖ్యలో భక్తులు పురాతన మార్గమైన నడకదారిలో…
తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) పాలక మండలి కీలక నిర్ణయం తీసుకుంది.. అలిపిరి నడకమార్గం రెండు నెలల పాటు మూసివేయాలని నిర్ణయానికి వచ్చింది.. మరమత్తుల కారణంగా రెండు నెలలు పాటు అంటే.. జూన్ 1వ తేదీ నుంచి జులై 31వ తేదీ వరకు అలిపిరి నడకమార్గం మూసివేస్తున్నట్టు టీటీడీ ప్రకటించింది.. పైకప్పు నిర్మాణం జరుగుతోన్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్టు.. 25 కోట్ల రూపాయల వ్యయంతో నడకమార్గంలో పైకప్పు నిస్మిస్తున్నట్టు చెబుతున్నారు టీటీడీ అధికారులు.. అయితే, ప్రత్యామ్నాయంగా…