తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) పాలక మండలి కీలక నిర్ణయం తీసుకుంది.. అలిపిరి నడకమార్గం రెండు నెలల పాటు మూసివేయాలని నిర్ణయానికి వచ్చింది.. మరమత్తుల కారణంగా రెండు నెలలు పాటు అంటే.. జూన్ 1వ తేదీ నుంచి జులై 31వ తేదీ వరకు అలిపిరి నడకమార్గం మూసివేస్తున్నట్టు టీటీడీ ప్రకటించింది.. పైకప్పు నిర్మాణం జరుగుతోన్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్టు.. 25 కోట్ల రూపాయల వ్యయంతో నడకమార్గంలో పైకప్పు నిస్మిస్తున్నట్టు చెబుతున్నారు టీటీడీ అధికారులు.. అయితే, ప్రత్యామ్నాయంగా భక్తులు శ్రీవారి మెట్టు నడక మార్గాన్ని వినియోగించు కోవాలని సూచిస్తున్నారు. కాగా, తిరుమల శ్రీవారి దర్శనానికి వెళ్లే భక్తులు.. అలిపిరి నుంచి మెట్ల మార్గంలో వెళ్తుంటారు.. నడకమార్గంలో వెళ్లడం కూడా ఓ మొక్కుగా నమ్ముతారు.. రోజు వేలాది మంది భక్తులు అలిపిరి మెట్ల మార్గం గుండా తిరుమలకు వెళ్లారు.. ఇక, శ్రీవారి మెట్టు నడక మార్గంలో కూడా మరికొంత మంది వెళ్తుంటారు.. ఇప్పుడు అలిపిరి మెట్ల మార్గం మూసివేయడంతో.. శ్రీవారి మెట్టు నడక మార్గంలోనే వెళ్లాల్సి ఉంటుంది.