తిరుమల వెళ్లే భక్తుల కోసం టీటీడీ కీలక సమాచారం విడుదల చేసింది. ఈనెల 20న ఉదయం 10 గంటలకు ఆన్‌లైన్‌లో ఆర్జిత సేవా టిక్కెట్లను విడుదల చేయనున్నట్లు ప్రకటించింది. ఏప్రిల్, మే, జూన్ నెలలకు సంబంధించిన ఆర్జిత సేవా టిక్కెట్లను ఈనెల 22 వరకు బుక్ చేసుకునేందుకు గడువు విధించినట్లు తెలిపింది. ఆన్‌లైన్ ఎలక్ట్రానిక్ డిప్ విధానంలో టిక్కెట్లను కేటాయిస్తామని టీటీడీ వివరించింది. ఈనెల 22న టిక్కెట్లు పొందిన వారికి వివరాలు పంపిస్తామంది. ఈనెల 20న ఆర్జిత…
కరోనా మహమ్మారి విజృంభణ ప్రభావం శ్రీవారి దర్శనాలపైనే కాదు.. ఆర్జిత సేవలు సహా వివిధ సేవా కార్యక్రమాలపై కూడా పడింది.. అయితే, క్రమంగా కరోనా కేసులు తగ్గి.. మళ్లీ సాధారణ పరిస్థితులు వస్తుండడంతో కీలక నిర్ణయం తీసుకుంది తిరుమల తిరుపతి దేవస్థానం.. శ్రీవారి ఆలయంలో ఏప్రిల్ 1వ తేదీ నుండి ఆర్జిత సేవలు తిరిగి ప్రారంభించనుంది.. ఆర్జిత సేవలకు ఏప్రిల్ 1వ తేదీ నుంచి భక్తులను అనుమతించాలని టీటీడీ నిర్ణయించింది. సుప్రభాతం, తోమాల, అర్చన, అష్టదళపాదపద్మారాధన, తిరుప్పావడ,…