మంగళవారం సాయంత్రం ఢిల్లీ నుంచి శ్రీనగర్ కు బయలుదేరిన ఇండిగో విమానం 6E2142 (రిజిస్ట్రీ VT-IMD) మార్గమధ్యలో ప్రతికూల వాతావరణ పరిస్థితులను ఎదుర్కొంది. ఢిల్లీ, శ్రీనగర్ మధ్య విమానంపై వడగళ్ల వర్షం పడింది. దీంతో విమానంలో గందరగోళం ఏర్పడింది. విమానంపై పిడుగు కూడా పడిందని చెబుతున్నారు. పైలట్ చాకచక్యం ప్రదర్శించాడు. పైలట్ ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ (ATC) తో అత్యవసర పరిస్థితిని ప్రకటించాడు.
India Pak War : సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఒక సంచలన వార్తకు ఫుల్‌స్టాప్ పెట్టింది ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో (PIB) నిజనిర్ధారణ విభాగం. జమ్మూ కాశ్మీర్‌లోని శ్రీనగర్ విమానాశ్రయం సమీపంలో దాదాపు 10 పేలుళ్లు సంభవించాయని వస్తున్న వార్తల్లో నిజం లేదని PIB తేల్చి చెప్పింది. అల్ జజీరా ఇంగ్లీష్ ప్రచురించినట్లుగా సోషల్ మీడియాలో షేర్ అవుతున్న ఒక నివేదికలో, విమానాశ్రయం పరిసరాల్లో వరుస పేలుళ్లు జరిగాయని తప్పుగా పేర్కొన్నారు. ఈ వార్త క్షణాల్లో…