India Pak War : సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఒక సంచలన వార్తకు ఫుల్‌స్టాప్ పెట్టింది ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో (PIB) నిజనిర్ధారణ విభాగం. జమ్మూ కాశ్మీర్‌లోని శ్రీనగర్ విమానాశ్రయం సమీపంలో దాదాపు 10 పేలుళ్లు సంభవించాయని వస్తున్న వార్తల్లో నిజం లేదని PIB తేల్చి చెప్పింది. అల్ జజీరా ఇంగ్లీష్ ప్రచురించినట్లుగా సోషల్ మీడియాలో షేర్ అవుతున్న ఒక నివేదికలో, విమానాశ్రయం పరిసరాల్లో వరుస పేలుళ్లు జరిగాయని తప్పుగా పేర్కొన్నారు. ఈ వార్త క్షణాల్లో వైరల్ కావడంతో ప్రజల్లో ఆందోళన నెలకొంది.
Indian Official Killed: పాక్ దాడుల్లో రాజౌరి అడిషనల్ డిప్యూటీ కమిషనర్ మృతి.. స్పందించిన సీఎం ఒమర్!
అయితే, ఈ ఊహాగానాలకు తెరదించుతూ PIB ఫాక్ట్ చెక్ ఈరోజు ఒక ట్వీట్ చేసింది. “జమ్మూ కాశ్మీర్‌లోని శ్రీనగర్ విమానాశ్రయం వద్ద దాదాపు 10 పేలుళ్లు జరిగాయని అల్ జజీరా పేర్కొంది. ఈ వార్త పూర్తిగా అవాస్తవం” అని PIB స్పష్టం చేసింది. జాతీయ భద్రత , ప్రజల భద్రతకు సంబంధించిన సమాచారం కోసం కేవలం అధికారిక వర్గాలపై మాత్రమే ఆధారపడాలని PIB ప్రజలకు విజ్ఞప్తి చేసింది. అంతేకాకుండా, ధృవీకరించని వార్తలపై అప్రమత్తంగా ఉండాలని సూచించింది.
“తప్పుదోవ పట్టించడానికి , గందరగోళం సృష్టించడానికి ఉద్దేశించిన ఇలాంటి అవాస్తవ కథనాలను నమ్మకండి” అని PIB తన ట్వీట్‌లో హెచ్చరించింది. ‘ఆపరేషన్ సింధూర్’ లైవ్ న్యూస్ , భారతదేశం, వినోదం, తాజా వార్తలు, భారతదేశం పాకిస్తాన్‌పై దాడి వంటి ముఖ్యమైన వార్తల కోసం అధికారిక సమాచార వనరులను మాత్రమే విశ్వసించండి. సోషల్ మీడియాలో వచ్చే ప్రతి వార్తను గుడ్డిగా నమ్మే ముందు ఒకటికి రెండుసార్లు సరిచూసుకోండి.
India – Pakistan War: ఢిల్లీ ఎయిర్‌పోర్ట్‌లో సాధారణ కార్యకలాపాలు.. ప్రయాణికులకు కీలక సూచనలు..