తీవ్ర ఆర్థిక సంక్షోభంలో వున్న శ్రీలంకలో అనూహ్య పరిణామాలు చోటుచేసుకున్నాయి. నిన్న రాత్రి జరిగిన అత్యవసర సమావేశం అనంతరం 26 మంది మంత్రులు రాజీనామా చేశారు. ప్రధాని నిర్ణయంపై ఆసక్తిగా మారింది శ్రీలంక రాజకీయం. రాజీనామా చేసిన వారిలో ప్రధాన మంత్రి మహీందా రాజపక్సే కుమారుడు క్రీడా శాఖమంత్రి నమల్ రాజపక్సే కూడా వున్నారు. శ్రీలంకలో అఖిలపక్ష ప్రభుత్వం ఏర్పాటు కానుందని తెలుస్తోంది. ప్రభుత్వంలో ప్రతిపక్ష నేతలు కూడా వుంటారు. రాజకీయ సుస్థిరతను కొనసాగించేందుకు కొత్త తాత్కాలిక…
శ్రీలంకలో సంక్షోభం తీవ్రరూపం దాల్చింది. ఆర్థిక పరిస్థితుల కారణంగా ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకత పెరిగిపోవడంతో ప్రజలు ఆందోళనలు చేపడుతున్నారు. దీంతో ఆ దేశ అధ్యక్షుడు రాజపక్సే ఎమర్జెన్సీ ప్రకటించారు. శుక్రవారం రాత్రి నుంచే ఇది అమల్లోకి వచ్చింది. ప్రజలకు రక్షణ, శాంతిభద్రతల పరిరక్షణ, అత్యవసర సరకులు, సేవల నిర్వహణ కోసం ఎమర్జెన్సీ ప్రకటిస్తున్నట్లు ప్రభుత్వం గెజిట్ విడుదల చేసింది. మరోవైపు శ్రీలంకలో ఆర్థిక సంక్షోభం కారణంగా నిత్యవసర వస్తువుల ధరలు ఆకాశాన్ని తాకాయి. రోజుకు 13 గంటలపాటు…
శ్రీలంక దేశాన్ని ఆర్థిక సంక్షోభం అతలాకుతలం చేస్తోంది. తాజాగా జరిగిన ఓ ఘటన ఆ దేశంలో పరిస్థితి ఎంతలా దిగజారిందో తెలియజేస్తోంది. నిధుల కొరత కారణంగా దిగుమతులు చేసుకోలేని దుస్థితి తలెత్తడంతో ఆ దేశంలో పేపర్ నిల్వలు అడుగంటిపోయాయి. దీంతో సోమవారం నుంచి జరగాల్సిన టర్మ్ పరీక్షలను అధికారులు వాయిదా వేశారు. ప్రశ్నపత్రం తయారీకి సరిపడా పేపర్, ఇంక్ లేకపోవడంతో పరీక్షలు నిర్వహించలేకపోతున్నామని అధికారులు ప్రకటించారు. శ్రీలంక అధికారుల నిర్ణయంతో దేశంలోని మొత్తం 45 లక్షల విద్యార్థుల్లో…
వివిధ కారణాల వల్ల నాలుగేళ్లుగా నిర్వహించలేకపోయిన ఆసియా కప్ క్రికెట్ టోర్నమెంట్‌ను తిరిగి ఈ ఏడాది ప్రారంభించాలని ఆసియా కప్ క్రికెట్ కౌన్సిల్ నిర్ణయించింది. శ్రీలంక వేదికగా ఆగస్టు 27 నుంచి ఆసియా కప్‌ను నిర్వహించేందుకు ఆమోదం తెలిపింది. ఆస్ట్రేలియాలో జరిగే టీ20 ప్రపంచకప్‌కు ముందు ఆసియా కప్‌ను నిర్వహిస్తుండటంతో ఈసారి టీ20 ఫార్మాట్‌లో ఈ టోర్నీ జరగనుంది. ఆసియా కప్‌లో టీమిండియా, శ్రీలంక, బంగ్లాదేశ్, పాకిస్థాన్, ఆప్ఘనిస్తాన్ జట్లతో పాటు మరో టీమ్ కూడా పాల్గొననుంది.…
బెంగళూరు వేదికగా శ్రీలంకతో జరుగుతున్న రెండో టెస్టులో టీమిండియా విజయం దిశగా దూసుకువెళ్తోంది. రెండో రోజు ఆటలో మరో 10 ఓవర్ల ఆట మిగిలి ఉండగా రెండో ఇన్నింగ్స్‌ను 303/9 స్కోరు వద్ద డిక్లేర్ చేసింది. రిషబ్ పంత్ (50), శ్రేయస్ అయ్యర్ (67) హాఫ్ సెంచరీలతో అదరగొట్టారు. రోహిత్ (46), విహారి (35), జడేజా (22), మయాంక్ (22) పరుగులు చేశారు. శ్రీలంక బౌలర్లలో జయవిక్రమ 4 వికెట్లు, ఎంబుల్‌దెనియా 3 వికెట్లు పడగొట్టారు. తొలి…
బెంగళూరు వేదికగా భారత్, శ్రీలంక మధ్య జరుగుతున్న రెండో (డే/నైట్) టెస్టులో భారత్ పట్టుబిగిస్తోంది. శ్రీలంక జట్టు తొలి ఇన్నింగ్సులో 109 పరుగులకు ఆలౌట్ అయ్యింది. శ్రీలంక బ్యాటర్లలో మథ్యూస్(43), డిక్‌వెల్లా(21) తప్ప ఎవరూ రాణించలేదు. భారత బౌలర్లలో బుమ్రా 5 వికెట్లు, అశ్విన్, షమీ తలో 2 వికెట్లు, అక్షర్ పటేల్ ఒక వికెట్ తీశారు. ఓవర్‌నైట్ స్కోరు 86/6తో రెండో రోజు ఆట ఆరంభించిన శ్రీలంకను చుట్టేయడానికి రోహిత్ సేనకు ఎంతో సమయం పట్టలేదు.…
స్వదేశంలో వరుస విజయాలతో దూసుకుపోతున్న టీమిండియాకు గట్టి షాక్ తగిలింది. బెంగళూరు వేదికగా శ్రీలంకతో జరగనున్న డే/నైట్ టెస్ట్‌కు స్టార్ ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా ఆడటంపై అనుమానాలు నెలకొన్నాయి. ఇటీవలే గాయం నుంచి కోలుకుని జట్టులోకి రీ ఎంట్రీ ఇచ్చిన జడేజా శ్రీలంకతో మొహాలీ వేదికగా జరిగిన టెస్టులో ఆల్‌రౌండ్ ప్రదర్శన చేశాడు. బ్యాటింగ్‌లో అజేయ సెంచరీతో చెలరేగిన జడేజా (175 నాటౌట్).. బౌలింగ్‌లో రెండు ఇన్నింగ్స్‌ల్లో కలిపి 9 వికెట్లు పడగొట్టాడు. అయితే ఫిట్‌నెస్ సమస్యలతో…
ఉక్రెయిన్, రష్యా మధ్య యుద్ధం ప్రభావం చమురు ధరలపై విపరీతంగా చూపిస్తోంది. ఫలితంగా పలు దేశాల్లో పెట్రోల్, డీజిల్ ధరలు భారీగా పెరుగుతున్నాయి. తాజాగా శ్రీలంకలో చమురు ధరలను పెంచుతున్నట్లు ఎల్‌ఐవోసీ ప్రకటించింది. ఈ మేరకు లీటర్ పెట్రోల్ ధర రూ.50, లీటర్ డీజిల్ ధర రూ.75 పెంచుతున్నట్లు తెలిపింది. ధరలను పెంచిన అనంతరం లీటర్ పెట్రోల్ ధర రూ.254కి చేరింది. లీటర్ డీజిల్ ధర రూ.214కి చేరింది. మరోవైపు శ్రీలంక రూపాయి భారీగా పతనమైంది. ఈ…
టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ మరో మైలురాయిని అందుకోనున్నాడు. శ్రీలంకతో ఈనెల 12 నుంచి బెంగళూరు వేదికగా జరిగే రెండో టెస్టు ద్వారా రోహిత్ తన కెరీర్‌లో 400వ అంతర్జాతీయ మ్యాచ్ ఆడనున్నాడు. రోహిత్ ఇప్పటివరకు 44 టెస్టులు, 230 వన్డేలు, 125 టీ20లు ఆడాడు. 2007లో అంతర్జాతీయ క్రికెట్‌లోకి ఎంట్రీ ఇచ్చిన రోహిత్ శర్మ మొదట్లో వరుసగా విఫలం కావడంతో జట్టులో సుస్థిర స్థానం సంపాదించుకోలేకపోయాడు. 2013లో ఓపెనర్ అవతారం ఎత్తినప్పటి నుంచి తిరుగులేకుండా దూసుకెళ్తున్నాడు.…
అల్లు అర్జున్ నటించిన పుష్ప సినిమా మేనియా ఇంకా తగ్గలేదు. ప్రపంచ వ్యాప్తంగా ఇప్పటికే చాలా మంది పుష్ప సినిమాలో అల్లు అర్జున్ చేసిన తగ్గేదేలే మేనరిజాన్ని ఇమిటేట్ చేస్తూ సోషల్ మీడియాలో రీల్స్ చేస్తున్నారు. ఇటీవల క్రికెటర్ రవీంద్ర జడేజా శ్రీలంకతో జరిగిన టీ20 సిరీస్‌లో తగ్గేదే లే అంటూ బన్నీ మేనరిజాన్ని ఇమిటేట్ చేయగా ఆ వీడియో తెగ వైరల్ అయ్యింది. తాజాగా శ్రీలంకతో జరుగుతున్న టెస్ట్ సిరీస్‌లో మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ…