రెండేళ్ళ క్రితం ‘రాజావారు రాణిగారు’ చిత్రంతో హీరోగా టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చాడు కిరణ్ అబ్బవరం. మొదటి సినిమాతోనే నటుడిగా కొంత గుర్తింపు తెచ్చుకున్నాడు. కిరణ్ అబ్బవరం నటించిన రెండో సినిమా ‘ఎస్. ఆర్. కళ్యాణ మండపం’. ప్రమోద్ – రాజు నిర్మించిన ఈ సినిమాతో శ్రీధర్ గాదె దర్శకుడిగా పరిచయమయ్యాడు. కరోనా ఫస్ట్ వేవ్ అండ్ సెకండ్ వేవ్ కారణంగా చిత్రీకరణలో, విడుదలలో జాప్యం జరిగిన ‘ఎస్. ఆర్. కళ్యాణమండపం’ శుక్రవారం జనం ముందుకు వచ్చింది. కథ…
“ఎస్ ఆర్ కళ్యాణమండపం” కరోనా సెకండ్ వేవ్ కు ముందే విడుదల కావాల్సిన చిత్రం. కానీ మహమ్మారి వల్ల రిలీజ్ వాయిదా పడింది. తాజా పరిస్థితుల నేపథ్యంలో ఆగస్టు 6న ఈ సినిమాను విడుదల చేయబోతున్నట్టు మేకర్స్ ప్రకటించారు. దీంతో సినిమా ప్రమోషన్లలో వేగం పెంచారు. తాజాగా “ఎస్ఆర్ కళ్యాణమండపం” ట్రైలర్ ను విడుదల చేశారు మేకర్స్. ట్రైలర్ చూస్తుంటే ఈ చిత్రం తండ్రి, కొడుకు ఎమోషనల్ జర్నీ నేపథ్యంలో సాగే కథ అని అర్థం అవుతోంది.…