“ఎస్ ఆర్ కళ్యాణమండపం” కరోనా సెకండ్ వేవ్ కు ముందే విడుదల కావాల్సిన చిత్రం. కానీ మహమ్మారి వల్ల రిలీజ్ వాయిదా పడింది. తాజా పరిస్థితుల నేపథ్యంలో ఆగస్టు 6న ఈ సినిమాను విడుదల చేయబోతున్నట్టు మేకర్స్ ప్రకటించారు. దీంతో సినిమా ప్రమోషన్లలో వేగం పెంచారు. తాజాగా “ఎస్ఆర్ కళ్యాణమండపం” ట్రైలర్ ను విడుదల చేశారు మేకర్స్. ట్రైలర్ చూస్తుంటే ఈ చిత్రం తండ్రి, కొడుకు ఎమోషనల్ జర్నీ నేపథ్యంలో సాగే కథ అని అర్థం అవుతోంది.
Read Also : దుల్కర్, హను రాఘవపూడి మూవీ ఇంట్రో టీజర్
సాయి కుమార్ ఈ చిత్రంలో కిరణ్ అబ్బవరం తండ్రిగా నటించారు. ఆయన పాత్ర ఆసక్తికరంగా ఉంది. చిన్న టౌన్ సెటప్, హీరోహీరోయిన్ల మధ్య సాగే ప్రేమకథ, యాక్షన్ ఎలిమెంట్స్ కూడా బాగున్నాయి. ముఖ్యంగా కిరణ్ అబ్బవరంకు సినిమాలో మంచి స్క్రీన్ స్పేస్ దొరికింది. ఈ సినిమాలోని తన నటనతో దర్శకనిర్మాతలను ఈ యంగ్ హీరో ఆకర్షించే అవకాశం ఉంది. ఈ చిత్రంలోని పాటలు ఇప్పటికే పెద్ద హిట్ అయ్యాయి. ఇప్పుడు ట్రైలర్ కూడా సినిమాపై హైప్ పెంచేసింది. శ్రీధర్ గేడ్ ఈ చిత్రానికి దర్శకత్వం వచించాడు. ప్రియాంక జవాల్కర్ హీరోయిన్ గా నటించింది. మీరు కూడా ఈ ట్రైలర్ ను వీక్షించండి.