మహిళలపై నేరాలు చేసేవారిపై అత్యంత కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులను సీఎం చంద్రబాబు ఆదేశించారు. మహిళలపై జరిగే నేరాల విషయంలో నిందితులకు ఖచ్చితంగా, వేగంగా శిక్ష పడేలా దర్యాప్తు సాగాలని సిఎం ఆదేశించారు. మహిళలపై నేరాలకు పాల్పడితే శిక్ష తప్పదనే భయం నేరగాళ్లలో రావాలని చంద్రబాబు అన్నారు. శ్రీసత్యసాయి జిల్లాలో అత్తాకోడళ్ళపై జరిగిన సామూహిక అత్యాచార ఘటనపై ముఖ్యమంత్రి డీజీపీ, ఇతర ఉన్నతాధికారులతో సమీక్ష చేశారు.
హిందూపురం గ్యాంగ్ రేప్‌పై మాజీ మంత్రి, శ్రీ సత్యసాయి జిల్లా వైఎస్సార్‌సీపీ అధ్యక్షురాలు ఉషా శ్రీ చరణ్ స్పందించారు. ఇద్దరు మహిళలపై గ్యాంగ్‌రేప్ అత్యంత దుర్మార్గం, విజయదశమి రోజు స్త్రీని పరాశక్తిగా కొలిచే ఈ దేశంలో ఇలాంటి ఘటన జరగడం చాలా బాధాకరమన్నారు.
శ్రీసత్యసాయి జిల్లా చిలమత్తూరు నల్లబొమ్మనిపల్లిలో అత్తాకోడలిపై అత్యాచార ఘటనపై హోం మంత్రి అనిత సీరియస్ అయ్యారు. అత్యారానికి పాల్పడిన దుండగులను సత్వరమే అరెస్ట్ చేయాలని ఆదేశించారు.
శ్రీసత్యసాయి జిల్లాలో గ్యాంగ్ రేప్ ఘటనపై జిల్లా ఎస్పీతో సీఎం చంద్రబాబు నాయుడు మాట్లాడారు. ఘటనపై దర్యాప్తు వివరాలు తెలుసుకున్నారు. వాచ్ మెన్, అతని కొడుకును కత్తులతో బెదిరించి అత్త, కోడలిపై అత్యాచారానికి పాల్పడినట్లు తెలిసింది.
శ్రీసత్యసాయి జిల్లా ధర్మవరం పట్టణంలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. రిమాండ్‌లో ఉన్న వైసీపీ కార్యకర్తలను పరామర్శించేందుకు ధర్మవరం సబ్ జైలుకి మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి వెళ్లగా.. అదే సమయంలో సబ్ జైలు బయట బీజేపీ - వైసీపీ కార్యకర్తలు ఎదురుపడ్డారు. ఈ క్రమంలోనే ఇరు పార్టీల కార్యకర్తల మధ్య వాగ్వివాదం చోటు చేసుకుంది.
శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురం మండలం తూమకుంటలో దారుణం జరిగింది. ఆ గ్రామంలోని ఓ సైకో రెచ్చిపోయాడు. ఏడేళ్ల చిన్నారిని కిరాతకంగా హత్య చేశాడు. అనంతరం చిన్నారి మృతదేహాన్ని గ్రామ శివారులోని పెన్నానది ఒడ్డున పాతిపెట్టాడు.
రేపు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి శ్రీసత్యసాయి జిల్లాలో పర్యటించనున్నారు. మధ్యాహ్నం 12 గంటలకు తాడేపల్లి నుంచి సీఎం జగన్ బయలుదేరనున్నారు. పన్నెండున్నరకు గన్నవరం విమానాశ్రయం నుంచి కడపకు ముఖ్యమంత్రి బయలుదేరనున్నారు.
శ్రీసత్యసాయి జిల్లా చెన్నేకొత్తపల్లిలో రైతులకు పంటల బీమా పరిహారం నిధులను ఏపీ సీఎం జగన్ విడుదల చేశారు. 2021 ఖరీఫ్‌లో వైపరీత్యాలు, చీడపీడల వల్ల పంట నష్టపోయిన చరిత్రలో ఎన్నడూ లేని విధంగా 15.61 లక్షల మంది రైతన్నలకు రూ.2,977.82 కోట్ల బీమా పరిహారాన్ని వారి ఖాతాల్లో నేరుగా జమ చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో సీఎం జగన్ మాట్లాడుతూ.. చంద్రబాబు, పవన్ కళ్యాణ్‌పై తీవ్ర విమర్శలు చేశారు. మోసం చేయడంలో చంద్రబాబు,…
ఉగాది వచ్చేస్తోంది.. తెలుగు వారి పండుగతో పాటు కొత్త జిల్లాల్లో డబుల్ ఉగాది జరగనుంది. దీనికి కారణం.. ఉగాది నుంచి పాలన సాగించేందుకు యంత్రాంగం చర్యలు యుద్ధప్రాతిపదికన చేపట్టడం. ఇప్పటికే కలెక్టరేట్, ఎస్పీ కార్యాలయం సిద్ధమవగా.. తాజాగా అన్ని శాఖలు ఉద్యోగుల విభజనతో పాటు కార్యాలయాలు కూడా సిద్ధం చేసుకుంటున్నాయి. అనంతలో కొత్త శ్రీ సత్యసాయి జిల్లా పేరుతో ఆవిర్భవిస్తున్న పుట్టపర్తిలో అధికారుల చర్యలతో సందడి కనిపిస్తోంది. ప్రభుత్వం చెప్పినట్టుగానే ఉగాది నుంచి కొత్త జిల్లాల్లో పాలనకు…