PM Modi: ప్రధాని నరేంద్రమోడీ కాంగ్రెస్ పార్టీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆర్టీఐ నివేదిక ద్వారా మన దేశానికి చెందిన ‘కచ్చతీవు’ ద్వీపాన్ని శ్రీలంకకు ఎలా అప్పగించిందనే వివరాలు వెల్లడైన తర్వాత, ప్రధాని నరేంద్రమోడీ ఆ పార్టీపై విమర్శలు గుప్పించారు. ఆర్టీఐ నివేదికను ‘ఆశ్చర్యకరమైనది’గా పిలిచిన ప్రధాని, భారతదేశ ఐక్యతను కాంగ్రెస్ బలహీనం చేస్తుందని ఆరోపించారు. 1970వ దశకంలో వ్యూహాత్మకమైన కచ్చతీవు ద్వీపాన్ని శ్రీలంకకు అప్పగించాలని కాంగ్రెస్ తీసుకున్న నిర్ణయంపై ఆదివారం పీఎం మోడీ ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ దేశ సమగ్రత, ప్రయోజనాలను కాంగ్రెస్ బలహీనం చేసిందని ఆరోపించారు.
1974లో అప్పటి ప్రధాని ఇందిరాగాంధీ నేతృత్వంలోని ప్రభుత్వం కచ్చతీవు ద్వీపాన్ని శ్రీలంకకు అప్పగించిందని ఆర్టీఐ నివేదిక వెల్లడించింది. ఈ చర్చ ఆశ్చర్యకరమైనదని, దేశ ప్రజలకు కోపాన్ని తెప్పించిందని, కాంగ్రెస్ పార్టీని ఎప్పటికీ నమ్మలేదని ప్రధాని మోడీ అన్నారు. ‘‘కచ్చతీవుని కాంగ్రెస్ ఎంత నిర్ద్వంద్వంగా వదులుకుందో వెల్లడిస్తుంది. ఇది ప్రతి భారతీయుడికి కోపం తెప్పించింది. మేము కాంగ్రెస్‌ని ఎప్పటికీ విశ్వసించలేము. 75 ఏళ్లుగా భారతదేశ ఐక్యత, సమగ్రత మరియు ప్రయోజనాలను బలహీనపరచడం కాంగ్రెస్ పని విధానం.’’ అని పీఎం మోడీ ఎక్స్ వేదికగా ధ్వజమెత్తారు.
Read Also: Bartharathna LK Advani: అద్వానీ ఇంటికి వెళ్లి ‘భారత రత్న’ను అందచేసిన ద్రౌపది ముర్ము, ప్రధాని మోడీ..!
భారత్‌కి చెందిన కచ్చతీవు ద్వీపాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం శ్రీలంకకు అప్పగించడంతో ఆ ప్రాంత సమీపానికి వెళ్తున్న తమిళనాడు మత్స్యకారులను శ్రీలంక నేవీ అరెస్ట్ చేస్తోంది. పాక్ జలసంధిలో భూభాగాన్ని పొరుగు దేశానికి అప్పగించాలని 1974లో అప్పటి ఇందిరాగాంధీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై తమిళనాడు బీజేపీ అధ్యక్షుడు కే. అన్నామలై సమాచారహక్కు పిటిషన్ ద్వారా ఈ నిజం వెలుగులోకి వచ్చింది.
తమిళనాడు జాలర్లు దేశానికి 25 కిలోమీటర్ల దూరంలో ఉన్న ద్వీపానికి సంచరిస్తున్నప్పుడు వారిని బంధించి జైళ్లలో పెట్టడానికి అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయమని బీజేపీ అధికార ప్రతినిధి సుధాన్షు త్రివేది పేర్కొన్నారు. ఈ ద్వీపం 1975 వరకు భారత్‌లో ఉందని ఆయన చెప్పారు. అయితే, లంకతో భారత్ కుదుర్చుకున్న ఒప్పందం వల్ల మన జాలర్లను అక్కడికి రాకుండా అడ్డుకుంటున్నట్లు ఆయన తెలిపారు. అయితే, డీఎంకే, కాంగ్రెస్ పార్టీలు మాత్రం ఈ అంశాన్ని లేవనెత్తడం లేదని విమర్శించారు.
Eye opening and startling!
New facts reveal how Congress callously gave away #Katchatheevu.
This has angered every Indian and reaffirmed in people’s minds- we can’t ever trust Congress!
Weakening India’s unity, integrity and interests has been Congress’ way of working for…
— Narendra Modi (@narendramodi) March 31, 2024
#WATCH | BJP MP Sudhanshu Trivedi says, "On the issue of Katchatheevu, I would like to remind the entire nation that it belonged to India till 1975 and it is just 25 km from the Indian coast in Tamil Nadu. Earlier Indian fishermen used to go there but during the reign of Indira… pic.twitter.com/EjerL17z07
— ANI (@ANI) March 31, 2024