IPL 2025: ఇండియన్ ప్రీమియర్ లీగ్-2025లో టేబుల్ సెకెండ్ టాపర్‌గా ఉన్న గుజరాత్ టైటాన్స్ ప్లేయర్ గ్లెన్ ఫిలిప్స్ గాయపంతో టోర్నీ మొత్తానికి దూరం అయ్యాడు. ఇక, అతడికి ప్రత్యామ్నాయ ఆటగాడిగా శ్రీలంక పరిమిత ఓవర్ల మాజీ కెప్టెన్ దసున్ షనకను తీసుకుంది.
PM Modi: ప్రధాని నరేంద్రమోడీకి శ్రీలంక అత్యున్నత పౌర పురస్కారాన్ని ప్రదానం చేసింది. శ్రీలంక-భారత్ సాంస్కృతిక సంబంధాలను ప్రోత్సహించడంలో ప్రధాని మోడీ అసాధారణ ప్రయత్నాలకు గుర్తింపుగా శనివారం ద్వీప దేశం ఈ అవార్డును అందించింది. ‘‘మిత్ర విభూషణ’’ పతకం ద్వారా శ్రీలంక మోడీని గౌరవించింది. ఇది స్నేహం, వారసత్వాన్ని సూచిస్తుంది. ప్రధాని మూడోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత తొలిసారిగా శ్రీలంకలో పర్యటిస్తున్నారు.
ప్రధాని మోడీ శ్రీలంకలో పర్యటిస్తున్నారు. శుక్రవారం సాయంత్రం ఆయన శ్రీలంక చేరుకున్నారు. కొలంబోలోని ఇండిపెండెన్స్ స్క్వేర్ దగ్గర మోడీకి శ్రీలంక అధ్యక్షుడు అనుర కుమార దిసానాయకే స్వాగతం పలికారు.
భారత రైల్వే ప్రయాణీకుల ఛార్జీలు పాశ్చాత్య దేశాలతో పోల్చితే చాలా తక్కువగా ఉన్నాయని రాజ్యసభలో రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ చెప్పారు. రైల్వే మంత్రిత్వ శాఖ పనితీరుపై సభలో జరిగిన చర్చకు వైష్ణవ్ సమాధానమిస్తూ.. పొరుగు దేశాల కంటే భారతదేశంలో రైలు ప్రయాణీకుల ఛార్జీలు చాలా తక్కువగా ఉన్నాయని అన్నారు. పాశ్చాత్య దేశాలు పాకిస్తాన్, బంగ్లాదేశ్, శ్రీలంక రైల్వే ఛార్జీలను ప్రస్తావించారు.
శ్రీలంక దిగ్గజ బ్యాట్స్‌మన్, మాజీ కెప్టెన్ దిముత్ కరుణరత్నే అంతర్జాతీయ క్రికెట్ నుంచి రిటైర్మెంట్ ప్రకటించాడు. 36 సంవత్సరాల వయస్సులో అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికాడు. ఫిబ్రవరి 6 నుండి గాలెలో ఆస్ట్రేలియాతో జరిగే రెండో టెస్ట్ తర్వాత అతను అంతర్జాతీయ క్రికెట్ నుంచి రిటైర్ కానున్నాడు.
Vasi Zakariya: పాకిస్థాన్ దేశంలోని ఖలీఫా సంస్థ జాతీయ అధ్యక్షుడిగా ఉన్న వరంగల్ వాసి జకర్యను పోలీసులు మద్రాసు ఎయిర్‌పోర్టులో అదుపులోకి తీసుకున్నారు. 25 సంవత్సరాల క్రితం పాకిస్తాన్ నుండి భారత్‌కు వచ్చిన జకర్య తొలుత ఎనిమిది సంవత్సరాలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని గుంటూరు జిల్లాలో జీవనం కొనసాగించాడు. అనంతరం తెలంగాణ రాష్ట్రం వరంగల్ జిల్లాలోని జాన్‌పీరీలు ప్రాంతంలో నివాసం ఏర్పరచుకున్నాడు. వరంగల్ జిల్లాలో స్థిరపడిన జకర్య, అండర్ బ్రిడ్జి ప్రాంతంలో ఒక బిర్యానీ సెంటర్‌ను నిర్వహిస్తూ జీవనం…
Champions Trophy 2025: శ్రీలంకలో జరిగిన ఛాంపియన్స్ ట్రోఫీ-2025లో భారత దివ్యాంగ క్రికెట్ టీమ్ అద్భుత విజయం సాధించింది. ఫైనల్ మ్యాచ్‌లో ఇంగ్లండ్‌పై 79 పరుగుల తేడాతో ఘన విజయం సాధించిన భారత జట్టు, టోర్నమెంట్ విజేతగా నిలిచింది. భారత దివ్యాంగ క్రికెట్ కౌన్సిల్ (DCCI) ఈ గెలుపును అధికారికంగా ప్రకటిస్తూ.. జట్టు సమిష్టి కృషిని కొనియాడింది. ఫైనల్ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 197 పరుగుల భారీ…
లైకులు, కామెంట్ల కోసం కొందరు ఎన్ని విన్యాసాలు అయినా చేస్తారు. అలాంటి విన్యాసాల వీడియోలు సోషల్ మీడియాలో బోలెడు దొరుకుతాయి. కొందరు స్టంట్స్ చేయబోయి అడ్డంగా బుక్కయిపోవడం కూడా చూశాం. కొందరు స్టంట్స్ను అదరగొట్టేస్తారు. మరికొందరు ప్రాణాలు కూడా పోగొట్టుకున్నారు. ముఖ్యంగా ప్రమాదకరమైన ప్రాంతాల్లో సెల్ఫీలు అంటూ స్టంట్స్ అంటూ చేసి ఎంతో మంది ప్రాణాల మీదికి తెచ్చుకున్నారు. తాజాగా సోషల్ మీడియాలో ఇలాంటి వీడియో వైరల్గా మారింది. READ MORE: UPI: వామ్మో.. యూపీఐ ద్వారా11…
ICC WTC Points Table: డర్బన్ వేదికగా శ్రీలంకతో జరిగిన తొలి టెస్టులో దక్షిణాఫ్రికా 233 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ విజయంతో ప్రపంచ టెస్టు ఛాంపియన్షిప్ పాయింట్ల పట్టికలో దక్షిణాఫ్రికా జట్టు అద్భుతాలు చేసిందనే చెప్పాలి. ఏకంగా రెండో స్థానంలో ఉన్న ఆస్ట్రేలియాను వెనక్కి నెట్టి దక్షిణాఫ్రికా జట్టు రెండో స్థానాన్ని కైవసం చేసుకుంది. ఈ దెబ్బతో దక్షిణాఫ్రికా ఇప్పుడు ఆస్ట్రేలియాతో పాటు భారతదేశానికి డేంజర్ అలెర్ట్ ని పెంచింది. Also Read:…
శ్రీలంక నూతన అధ్యక్షుడు అనురా కుమార దిసానాయకేకు పార్లమెంటులో మెజారిటీ లభించింది. ఇది ఆయన ఆర్థిక సంస్కరణల ఎజెండాను బలోపేతం చేసింది. భారతదేశంతో బలమైన భాగస్వామ్యాన్ని నిర్మించింది. ఎన్నికల ఫలితాల అనంతరం, భారత హైకమిషనర్ సంతోష్ ఝాతో దిసానాయకే సమావేశమయ్యారు. శ్రీలంక ఆర్థిక వ్యవస్థను తిరిగి గాడిలో పెట్టేందుకు భారత్ సహకారం కోరారు.