Women’s World Cup 2025: అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ICC) నేడు (జూన్ 2) 2025 మహిళల క్రికెట్ వరల్డ్ కప్ వివరాలను అధికారికంగా ప్రకటించింది. ఈ ICC మహిళల 50 ఓవర్ల ప్రపంచ కప్ సెప్టెంబర్ 30 నుండి నవంబర్ 2, 2025 వరకు భారత్, శ్రీలంకలో జరిగేలా షెడ్యూల్ చేయబడింది. ఈ టోర్నీలో భారత్, ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్, దక్షిణాఫ్రికా, న్యూజిలాండ్, శ్రీలంక, బంగ్లాదేశ్, పాకిస్థాన్ మొత్తంగా ఎనిమిది జట్లు పాల్గొంటాయి. టోర్నీ ప్రారంభ మ్యాచ్ సెప్టెంబర్ 30న బెంగళూరులో జరుగనున్నది.
Read Also: IPL 2025 Final: కొత్త ఛాంపియన్ ఎవరు..? ట్రోఫీతో ఇరుజట్ల కెప్టెన్స్.. ఫొటోస్ వైరల్
ఇక భారతదేశంలో ఎం. చిన్నస్వామి స్టేడియం (బెంగళూరు), ACA స్టేడియం (గువాహటి), హోల్కర్ స్టేడియం (ఇండోర్), ACA-VDCA స్టేడియం (విశాఖపట్టణం)లో మ్యాచ్ లు జరగనుండగా.. శ్రీలంకలో ఆర్. ప్రెమదాస స్టేడియం, కొలంబో లో మ్యాచ్ లు జరగనున్నాయి.
Read Also: Tata Altroz Facelift: బుకింగ్స్ ఓపెన్.. కేవలం రూ.21,000తో ఆల్ట్రోజ్ ఫేస్‌లిఫ్ట్ సొంతం చేసుకోండి..!
ఇక తేదీల విషయానికి వస్తే.. ప్రారంభ మ్యాచ్ సెప్టెంబర్ 30న బెంగళూరులో అలాగే ఫస్ట్ సెమిఫైనల్ అక్టోబర్ 29న గువాహటి లేదా కొలంబోలో, సెకండ్ సెమిఫైనల్ అక్టోబర్ 30న బెంగళూరు, ఇక ఫైనల్ నవంబర్ 2 బెంగళూరు లేదా కొలంబోలో జరుగుతుంది. చివరిసారి చాంపియన్లుగా ఉన్న ఆస్ట్రేలియా జట్టు టోర్నీ ఫేవరెట్‌గా ఉంది. వారు ఇప్పటివరకు ఏడుసార్లు ప్రపంచ కప్ విజేతలుగా నిలిచారు. 2022లో న్యూజిలాండ్‌లో జరిగిన ఫైనల్‌లో ఇంగ్లండ్‌ను ఓడించారు.