Asia Cup-2023: టీమిండియా జెర్సీపై కనిపించని పాక్ లోగో
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఆసియా కప్-2023 టోర్నమెంట్ నేపథ్యంలో ఆటగాళ్ల జెర్సీలపై ఆతిథ్య జట్టు పేరు లేకపోవడం ఇప్పుడు విమర్శలకు దారి తీసింది. సాధారణంగా మేజర్ క్రికెట్ ఈవెంట్లలో ప్లేయర్లు వేసుకునే జెర్సీలపై హోస్ట్ పేరు కూడా కనిపిస్తుంది. అయితే, ఈసారి ఆసియా కప్ విషయంలో మాత్రం ఇలా జరుగలేదు. దీంతో పాకిస్తాన్ మాజీ క్రికెటర్లు ఆసియా క్రికెట్ కౌన్సిల్ తీరుపై తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. కాగా ఆసియా వన్డే కప్-2023 ఈవెంట్ ఆతిథ్య హక్కులు మొదట పాకిస్తాన్ దక్కించుకున్నప్పటికి.. భద్రతా కారణాల దృష్ట్యా టీమిండియాను అక్కడికి పంపించేందుకు బీసీసీఐ ససేమిరా అనడంతో శ్రీలంక బరిలోకి వచ్చింది.
Read Also: Minister Amarnath: మానవత్వం చాటుకున్న మంత్రి గుడివాడ అమర్నాథ్
Also Read
- India vs Pakistan: ఆసియా కప్‌లో మరోసారి భారత్-పాక్ పోరు సాధ్యమే.. కానీ, ఓ ట్విస్ట్!
- Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీకి భారీ శుభవార్త చెప్పిన బీసీసీఐ.. ఎట్టకేలకు లిస్ట్‌లో పేరు..
- Tilak Varma: ఆసియా కప్ ట్రోఫీ కాంట్రవర్సరీ.. సంచలన విషయం వెల్లడించిన తిలక్!
- BCCI vs PCB: ఎందుకయ్యా అతి చేస్తావ్.. ట్రోఫీపై నఖ్వీకి షాక్ ఇచ్చేందుకు బీసీసీఐ రెడీ
టీమిండియా ఆడే మ్యాచ్ లన్నీ శ్రీలంకలో జరిగే విధంగా హైబ్రిడ్ పద్ధతిలో టోర్నమెంట్ నిర్వహణకు ఆసియా క్రికెట్ కౌన్సిల్.. పాకిస్థాన్ క్రికెట్ బోర్డును ఒప్పించింది. ఈ నేపథ్యంలో ఆగష్టు 30 నుంచి ఈ వన్డే ఈవెంట్ ప్రారంభమైంది. అయితే, ఆటగాళ్ల జెర్సీలపై పాక్ లోగో మిస్ కావడం క్రికెట్ వర్గాల్లో తీవ్రమైన చర్చకు దారి తీసింది. కావాలనే పాకిస్తాన్ పేరును మిస్ చేశారంటూ మాజీ క్రికెటర్లు రషీద్ లతీఫ్, మొహ్సిన్ ఖాన్ ఏసీసీపై విమర్శలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో.. పాకిస్తాన్ క్రికెట్ బోర్డు.. ఆటగాళ్ల జెర్సీలపై తమ లోగో లేకపోవడానికి గల కారణాలను వెల్లడించింది.
Read Also: Clay Ganesh : తెలంగాణలో విద్యార్థులకు గుడ్‌న్యూస్.. మట్టిగణపతి చేయండి 10లక్షల బహుమతులు
అయితే, ఈ సంవత్సరం నుంచి ఆసియా క్రికెట్ మండలి కొత్త మార్గదార్శలకాలను అమలులోకి తీసుకువచ్చిందని.. దాని ప్రకారం ఆతిథ్య జట్ల లోగోలు ఆటగాళ్ల జెర్సీలపై ఉండడం లేదని చెప్పినట్లు తెలిపారు. ఇక నుంచి ఏ జట్టుకైనా ఇదే రూల్ వర్తిస్తుందని చెప్పినట్లు టాక్. కాగా, ఆసియా వన్డే కప్ తొలి మ్యాచ్‌లో పాకిస్తాన్.. నేపాల్‌పై గెలవగా.. రెండో మ్యాచ్‌లో శ్రీలంక బంగ్లాదేశ్‌ను ఓడించింది. అయితే, మూడో మ్యాచ్ రేపు భారత్-పాకిస్థాన్ మధ్య జరుగనుంది.
తాజావార్తలు
-
Shai Hope: భారత్‌ను ఎదుర్కోవాలంటే ఆ స్కోర్ సరిపోదు.. ఓటమికి ప్రధాన కారణం ఇదే: వెస్టిండీస్ కెప్టెన్
-
Earthquake : ఉత్తరాఖండ్‌లో భూకంపం.. ఢిల్లీ-ఎన్సీఆర్ వరకు ప్రకంపనలు!
-
Shreyas Iyer: సెంచరీతో శ్రేయాస్ అయ్యర్ వీర విహారం.. వెస్టిండీస్ చిత్తు చిత్తు.. భారత్ ఘన విజయం..
-
Wife Kills Husband: ప్రియుడితో కలిసి భర్తను చంపిన భార్య.. ఫోన్ చాట్‌తో వెలుగులోకి దారుణం..
-
Team India New Captain: బీసీసీఐ సంచలన నిర్ణయం.. భారత మహిళా జట్టుకు కొత్త కెప్టెన్ ప్రకటన..
ట్రెండింగ్
-
Hong Kong Sixes 2026: మరోసారి భారత్-పాకిస్థాన్ మ్యాచ్.. కెప్టెన్‌గా భువీ..!
-
Smriti Mandhana: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత మహిళల కొత్త కెప్టెన్‌గా స్మృతి మంధాన..!?
-
Captain Changes: ఆసియా గేమ్స్‌లో ఓటమి.. పాకిస్థాన్ కెప్టెన్ పై వేటు..! కొత్త కెప్టెన్ ఎవరంటే.?
-
WCL 2026 నుంచి పాకిస్థాన్ ఛాంపియన్స్ ఔట్.. NOC ఇవ్వని PCB.!
-
Kakarakaya Vepudu: అన్నంలోకి ‘కాకరకాయ వేపుడు’.. ఇలా చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!