శ్రీలంక స్టార్ క్రికెటర్ వనిందు హసరంగ తన చెల్లి పెళ్లిలో ఏడ్చేశాడు. అప్పగింతల కార్యక్రమం సందర్భంగా తన సొదరిని, బావను కౌగిలించుకుని హసరంగ కన్నీటి పర్యంతమయ్యాడు. చెల్లితో తనకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకుంటూ ఈ స్టార్ క్రికెటర్ బోరున విలపించాడు. ఇదే టైంలో అతని చెల్లి, బావ కూడా కన్నీళ్లు పెట్టుకున్నారు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట చక్కర్లు కొడుతుంది. ఇది చూసిన నెటిజన్లు అన్ని బంధాల కంటే అన్నాచెల్లెల్ల అనుబంధం చాలా గొప్పదంటూ వ్యాఖ్యనిస్తున్నారు.
Read Also: Amit Shah: దేశ అంతరిక్ష యాత్రకు ప్రధాని మోడీ కొత్త వేగం, శక్తిని అందించారు..
కాగా, ఇటీవల ముగిసిన లంక ప్రీమియర్ లీగ్‌లో హసరంగ ఆకాశమే హద్దుగా రెచ్చిపోయి.. తన జట్టు బీ లవ్ క్యాండీని ఛాంపియన్‌గా నిలిపాడు. టోర్నీ ఆధ్యాంతరం ఆల్‌రౌండ్ ప్రదర్శనతో హసరంగ ఇరగదీశాడు. లీడింగ్ రన్ స్కోరర్‌గా, లీడింగ్ వికెట్ టేకర్‌గా, అత్యధిక సిక్సర్లు కొట్టిన బ్యాటర్‌గా పలు అవార్డులు హసరంగ సొంతం చేసుకుని, ప్లేయర్ ఆఫ్ ద సిరీస్‌గా నిలిచాడు. ఒంటిచేత్తో తన టీమ్ ను ఫైనల్‌కు చేర్చిన ఈ స్టార్ ప్లేయర్.. గాయం కారణంగా ఫైనల్ మ్యాచ్ ఆడలేదు.. అయినప్పటికీ బి లవ్ క్యాండీ ఛాంపియన్ గా నిలిచింది. ఇదిలా ఉంటే, ఆసియా కప్-2023కు ముందు శ్రీలంక టీమ్ కు భారీ షాక్ లు తగిలాయి. సూపర్ ఫామ్‌లో ఉన్న హసరంగ, దుష్మంత చమీరా గాయాల బారిన పడగా.. స్టార్ ప్లేయర్లు కుశాల్ పెరీరా, ఆవిష్క ఫెర్నాండోలకు కోవిడ్ పాజిటివ్ వచ్చింది. ఈనెల 30న స్టా్ర్ట్ అయ్యే ఆసియా కప్ శ్రీలంక, పాక్ వేదికలుగా జరుగనున్నాయి.
Read Also: Khushi: పెళ్ళాలు.. దెయ్యాలు.. డైరెక్టర్ నిజ జీవిత అనుభవల్లా ఉన్నాయే
ఈ మెగా టోర్నీలో శ్రీలంక ఆగస్ట్ 31న తమ తొలి మ్యాచ్‌ను బంగ్లాదేశ్‌తో ఆడనుంది. పల్లెకెలెలో ఈ మ్యాచ్ జరుగనుంది. మరోవైపు ఇదే టోర్నీలో భారత్-పాక్ మ్యాచ్ సెప్టెంబర్ 2న జరగనుంది. ఈ మ్యాచ్ కూడా పల్లెకెలె గ్రౌండే ఆతిథ్యమివ్వనుంది. అనంతరం సెప్టెంబర్ 4 భారత్.. నేపాల్‌తో మ్యాచ్ ఆడనుంది. భారత్, శ్రీలంకలు వేర్వేరు గ్రూప్‌ల్లో ఉండటంతో స్టేజీ-1లో తలపడే ఛాన్స్ లేదు. సెప్టెంబర్ 17న జరిగే ఫైనల్‌తో ఆసియాకప్ క్లోజ్ అవుతుంది. అనంతరం అక్టోబర్, నవంబర్ నెలల్లో వన్డే వరల్డ్‌కప్ స్టార్ట్ కానుంది.
Wanindu Hasaranga gets emotional at his sister's wedding. pic.twitter.com/OEuHgm7eSX
— Mufaddal Vohra (@mufaddal_vohra) August 26, 2023