Asia Cup 2023: ఆసియా కప్ ముందు శ్రీలంకకు వరుస షాక్స్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మరి కొన్ని గంటల్లో ఆసియా కప్-2023కు ముందు శ్రీలంక జట్టుకు వరుస ఎదురుదెబ్బలు తగుతున్నాయి. ఆ జట్టులోని స్టార్ ఆటగాళ్లంతా గాయాలు, కోవిడ్ కారణంగా ఒక్కొక్కరుగా టీమ్ కు దూరమవుతున్నారు. తాజాగా స్టార్ ఆల్‌రౌండర్ వనిందు హసరంగ టోర్నీ నుంచి తప్పుకున్నాడు. తొడ కండరాల సమస్యతో బాధపడుతున్న హసరంగ పూర్తి కోలుకోకపోవడంతో శ్రీలంక బోర్డు అతన్ని టీమ్ నుంచి పక్కకు తప్పించింది.
Read Also: KA Paul: విశాఖలో సీఐ కాలర్ పట్టుకుని కేఏ పాల్ ఓవరాక్షన్
Also Read
- Pawan Kalyan: అడవి తల్లి బాట 2.0 కార్యక్రమం ప్రారంభం.. స్థానిక ఎన్నికల్లో కూటమి సత్తా చాటాలి.!
- Supreme Court: సీజేపీ నిరసన ఎఫెక్ట్.. పోలీసులకు సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు..
- Chiranjeevi: వయసు ఒక నంబర్ మాత్రమే..! ప్రేమ, అభిమానమే నాకు ఎనర్జీ..
- EPFO Update: పీఎఫ్ డబ్బుల డ్రాపై ఈపీఎఫ్ఓ కొత్త రూల్.. ఇకపై ఆ ఫారమ్‌లు పనిచేయవు!
వనిందు హసరంగకు ముందు దిల్షన్ మధుష్క, లహీరు కుమార, దుష్కంత చమీరా కూడా గాయాలు కావడంతో ఆసియా కప్‌కు దూరమయ్యారు. కాగా, మరో ప్లేయర్ కోవిడ్ కారణంగా జట్టుకు దూరంగా ఉన్నాడు. ఆవిష్క ఫెర్నాండో కోవిడ్‌తో ఇబ్బంది పడుతున్నాడు. ఈ ఐదుగురిని లంక సెలెక్టర్లు తొలుత ఆసియాకప్ కోసం ఎంపిక చేశారు.. అయితే గాయాలు, కోవిడ్ కారణంగా వీరు జట్టుకు దూరం కావడంతో.. ప్రత్యామ్నాయ ఆటగాళ్ల జాబితాను రిలీజ్ చేసింది. ఇదిలా ఉంటే, ఆసియా కప్‌లో లంక తమ తొలి మ్యాచ్‌లో బంగ్లాదేశ్‌తో పోటీ పడుతుంది.
Read Also: Chandrayaan-3: 7 రోజులుగా జాబిల్లిపై చంద్రయాన్-3 ఏమి చేసింది?
బంగ్లా-శ్రీలంక మధ్య మ్యాచ్ ఆగస్ట్ 31న పల్లెకెలె వేదికగా జరుగనుంది. ఈ టోర్నీ రేపటి (ఆగస్ట్ 30న) నుంచి ప్రారంభమవుతుంది. పాకిస్తాన్-నేపాల్ మధ్య మ్యాచ్‌తో ఈ టోర్నీ ప్రారంభం కానుంది. సెప్టెంబర్ 2న భారత్-పాక్‌లు పల్లెకెలెలో పోటీ పడబోతున్నాయి. సెప్టెంబర్ 4న భారత్-నేపాల్, సెప్టెంబర్ 5న శ్రీలంక-ఆఫ్ఘనిస్తాన్ మ్యాచ్‌లు జరుగనున్నాయి. అయితే, సెప్టెంబర్ 17న జరిగే ఫైనల్ మ్యాచ్ తో ఆసియా కప్ ముగియనుంది.
తాజావార్తలు
-
New Bajaj Pulsar NS125 Leak: కొత్త Bajaj Pulsar NS125 ఫస్ట్ లుక్.. LCD డిస్‌ప్లే, USB-C ఛార్జింగ్‌తో కొత్త ఫీచర్లు!
-
Aafiya Sayed : టాలీవుడ్లోకి బాలీవుడ్ యంగ్ బ్యూటీ ఇంట్రడ్యూస్
-
Pawan Kalyan: అడవి తల్లి బాట 2.0 కార్యక్రమం ప్రారంభం.. స్థానిక ఎన్నికల్లో కూటమి సత్తా చాటాలి.!
-
Supreme Court: సీజేపీ నిరసన ఎఫెక్ట్.. పోలీసులకు సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు..
-
Chiranjeevi: వయసు ఒక నంబర్ మాత్రమే..! ప్రేమ, అభిమానమే నాకు ఎనర్జీ..
ట్రెండింగ్
-
EPFO Update: పీఎఫ్ డబ్బుల డ్రాపై ఈపీఎఫ్ఓ కొత్త రూల్.. ఇకపై ఆ ఫారమ్‌లు పనిచేయవు!
-
Cockroach Control Tips: వంటింట్లో బొద్దింకలు తిరుగుతూ చికాకు తెప్పిస్తున్నాయా.? ఈ చిట్కాతో శాశ్వతంగా సమస్యకు చెక్ పెట్టండి..!
-
Least Eligible Bachelor: లీస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ రివ్యూ..
-
Onion Peel Benefits: ఉల్లిపాయ తొక్కలను పారేస్తున్నారా? వీటి ఉపయోగాలు తెలిస్తే చెత్తబుట్టలో అస్సలు వేయరు..!
-
Tirumala: నవరాత్రి బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ.. నేటి నుంచి ప్రత్యేక దర్శనాలు రద్దు.!