Sri Lanka: ద్వీప దేశం శ్రీలంకలో అధ్యక్ష ఎన్నికల హడావుడి ప్రారంభమైంది. వచ్చే నెలలో జరిగే ఎన్నికల్లో ఏకంగా 39 మంది అభ్యర్థులు బరిలో దిగారు. ఈ అధ్యక్ష ఎన్నికల్లో ముగ్గురు మైనారిటీ తమిళులతో పాటు ఇద్దరు బౌద్ధ సన్యాసులు, వివిధ రాజకీయ పార్టీలకు చెందిన పెద్ద నాయకులు పోటీ చేస్తున్నారు.
దివాళా తీసిన శ్రీలంక వచ్చే నెలలో జరగాల్సిన స్థానిక ఎన్నికలను వాయిదా వేయడానికి సిద్ధంగా ఉందని ఓ ఉన్నతాధికారి తెలిపారు. ఈ రోజు ప్రతిపక్షాల నిరసనల నేపథ్యంలో పార్లమెంటును వాయిదా వేయవలసి వచ్చింది.