దివాళా తీసిన శ్రీలంక వచ్చే నెలలో జరగాల్సిన స్థానిక ఎన్నికలను వాయిదా వేయడానికి సిద్ధంగా ఉందని ఓ ఉన్నతాధికారి తెలిపారు. ఈ రోజు ప్రతిపక్షాల నిరసనల నేపథ్యంలో పార్లమెంటును వాయిదా వేయవలసి వచ్చింది.
తీవ్ర ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయిన శ్రీలంకకు ఆపన్నహస్తం అందించి అండగా నిలుస్తోంది భారత్. ప్రస్తుత సంక్షోభ సమయంలో భారత్తో మళ్లీ స్నేహ సంబంధాలకు హస్తం చాచింది కొలంబో. సంక్షోభంలో చిక్కుకున్న పొరుగుదేశమైన శ్రీలంకకు భారత్ సోమవారం 21,000 టన్నుల ఎరువులను అందజేసింది.
Sri Lankan crisis- women into prostitution: శ్రీలంకలో రాజకీయ అధికారం మారినా.. ప్రస్తుతం ఆర్థిక పరిస్థితుల్లో ఎలాంటి మార్పు వచ్చే పరిస్థితి కనిపించడం లేదు. ఇప్పటికీ ప్రజలు నిత్యావసరాలు దొరకడం గగనం అయిపోయింది. పెట్రోల్, డీజిల్ కోసం పెద్దపెద్ద క్యూల్లో నిలబడుతున్నారు. శ్రీలంకలో ఆర్థిక సంక్షోభం అన్ని రంగాలను దెబ్బతీసింది. ఫలితంగా చాలా మంది ఉద్యోగం, ఉపాధి కోల్పోయారు. పని చేసేందుకు సిద్ధంగా ఉన్న పని లభించని పరిస్థితి ఏర్పడింది.
శ్రీలంక నూతన అధ్యక్షుడు రణిల్ విక్రమసింఘే పార్లమెంట్ కాంప్లెక్స్‌లో ప్రమాణస్వీకారం చేశారు. బుధవారం జరిగిన ఎన్నికల్లో ఆయన 134 ఓట్లు సాధించి ప్రత్యర్థి డల్లాస్ అలహప్పెరుమాపై గెలుపొందారు.
శ్రీలంకలో అధ్యక్షుగు గొటబయ రాజపక్స మాల్దీవులకు పారిపోయాడు. తీవ్రమైన ఆర్థిక సమస్యలతో సతమతం అవుతున్న ద్వీపదేశంలో శనివారం నుంచి మళ్లీ ఉవ్వెత్తున ఆందోళను ఎగిసిపడ్డాయి. దీంతో గొటబయ రాజపక్స అధ్యక్ష భవనాన్ని వదిలి పరార్ అయ్యారు. తాజాగా ఆయన తన భార్య, ఇద్దరు బాడీగార్డులతో మాల్దీవులకు చేరినట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే ఇప్పుడో వార్త భారత్ ను ఆందోళనకు గురిచేసింది. అధ్యక్షుడు గొటబాయ రాజపక్స దేశాన్ని వదిలిపోవడానికి భారత్ సహకరించిందనే వార్తలు వినిపిస్తున్నాయి. అక్కడి మీడియా ఈ…
సామాన్యుడు కొనలేని విధంగా పెట్రోల్, డీజిల్ ధరలు చుక్కులనంటుతున్నాయి. ఈ నేపథ్యంలో బయటకు బండి తీయాలంటేనే వణికిపోతున్న ప్రజలు.. వాహనాలకు బదులు సైకిళ్లను కొనేందుకు ఇష్టపడుతున్నారు.
ఆర్థిక సంక్షోభంలో చిక్కుకున్న శ్రీలంకలో దయనీయ పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఎక్కడ చూసిన పొడవైన క్యూలే దర్శనమిస్తున్నాయి. రోజుల తరబడి ప్రజలు చూస్తున్నా.. నిత్యావసరాలు దొరకడం లేదు. ముఖ్యంగా పెట్రోల్, గ్యాస్, డిజిల్ స్టేషన్ల వల్ల పెద్ద ఎత్తున వాహనాలు, ప్రజలు దర్శనమిస్తున్నారు. ఇలాంటి సంక్షోభం మధ్య ఉండలేమనుకున్న ప్రజలు వేరే దేశాలకు వెళ్లేందుకు ప్రయత్నిస్తున్నారు. దీంతో దేశం నుంచి విదేశాలకు వెళ్లి ఉపాధి పొందేందుకు పాస్‌పోర్ట్ కోసం ప్రజలు దరఖాస్తు చేస్తుకుంటున్నారు. ఈ క్రమంలోనే రెండు రోజులుగా…
శ్రీలంక ఆర్థిక సంక్షోభంతో అల్లాడుతోంది. ఇప్పటికిప్పుడు ఆ దేశ పరిస్థితి మెరుగయ్యే అవకాశం కనిపించడం లేదు. దేశంలో ఆహారంతో పాటు ఇంధన సంక్షోభం నెలకొంది. ఎక్కడ చూసినా ప్రజలు పెట్రోల్, డిజిల్, గ్యాస్ కోసం క్యూ లైన్లలో దర్శనమిస్తున్నారు. రోజుల తరబడి ఎదురుచూసిన శ్రీలంకలో లీటర్ పెట్రోల్ దొరకని పరిస్థితి ఉంది. విదేశీమారక నిల్వలు అడుగంటుకుపోవడంతో ఇతర దేశాల నుంచి ఇంధనాన్ని దిగుమతి చేసుకునే పరిస్థితి కూడా లేదు. ఈ నేపథ్యంలో శ్రీలంక ప్రభుత్వం మరోసారి కీలక…
ఆర్థిక సంక్షోభంతో శ్రీలంకలో కొట్టుమిట్టాడుతోంది. రోజురోజుకు శ్రీలంకలో పరిస్థితులు దిగజారిపోతున్నాయి. ఇప్పటికే నిత్యావసర ధరలు ఆకాశాన్నంటాయి. అయితే.. ఇటీవల పెట్రోల్, డీజిల్ నిలువలు కూడా లేకపోవడంతో శ్రీలంకలోని ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదరుర్కొంటున్నారు. కోలంబోలో పరిస్థితి దారుణంగా తయారైంది. పెట్రోలు బంక్ వద్ద లంకా వాసుల ఘర్షణలకు దిగుతున్నారు. పెట్రోల్, డీజిల్ కోసం ఒకరిని ఒకరు క్యాన్ లతో లంకా వాసులు కొట్టుకున్నారు. మరో మూడు రోజులు పెట్రోలు, డీజిల్ దేశంలో ఉండదని లంక ప్రభుత్వం ప్రకటించింది.…