దేశం తీవ్ర సంక్షోభంలో కూరుకుపోయిన సమయంలో శ్రీలంక ప్రధానిగా బాధ్యతలు అందుకున్న రణిల్ విక్రమసింఘే కీలక నిర్ణయం తీసుకున్నారు.. తన మంత్రివర్గంలోకి నలుగురిని చేర్చుకున్నారు. ఆర్థిక వ్యవస్థను తిరిగి గాడిలో పెట్టడం కోసం ప్రభుత్వ ఏర్పాటును వేగవంతం చేశారు. ఆయన మంత్రివర్గంలో గరిష్ఠంగా 20 మంది మంత్రులు మాత్రమే ఉంటారని తెలుస్తోంది. పార్లమెంటులో ఆయన మెజారిటీని నిరూపించుకోవడానికి అధికార పార్టీ అయిన శ్రీలంక పొదుజన పెరమున సంపూర్ణ మద్దతు ప్రకటించింది. మొత్తంగా.. జీఎల్ పెయిరిస్, దినేశ్ గుణవర్ధనే,…
పొరుగు దేశం శ్రీలంక తీవ్ర ఆర్థిక, రాజకీయ సంక్షోభంతో అట్టుడుకుతోంది. పాలక రాజపక్స కుటుంబంపై ప్రజలు తిరుగుబాటు కొనసాగుతోంది. ప్రస్తుత ఆర్థిక దుస్థితికి రాజపక్సలే కారణం అంటూ గత కొన్ని నెలలుగా లంక ప్రజలు తీవ్ర ఆగ్రహావేశాలతో రగిలిపోతున్నారు. నిరుద్యోగం, అధిక ధరలు, విద్యుత్ కోతలు, ఇందన కొరత, నిత్యావసరాల లేమితో ప్రత్యక్ష నరకం అనుభవిస్తున్న ప్రజలు ఒక్కసారిగా పాలకవర్గం మీద తిరగబడ్డారు. వీధుల్లోకి వచ్చి నిరసనల ప్రదర్శనలు చేస్తున్నారు. విద్యార్థులు, నిరుద్యోగులతో పాటు అన్ని వర్గాల…
శ్రీలంకలో సంక్షోభం మరింత ముదిరింది. ఒకవైపు పెరుగుతున్న. ఆహార ధరలు… మరోవైపు ఆందోళన నడుమ శ్రీలంక వాసులు తల్లిడిల్లిపోతున్నారు. ఎప్పుడూ ఎమీ జరుగుతోంది అర్థం కాని అయోమయాపరిస్దితిల్లో బతుకుతున్నారు.. నెలరోజులుగా రోడ్డెక్కి నినదిస్తున్న శ్రీలంక ప్రజల ఆందోళన హింసాత్మకంగా మారుతున్నాయి. దీనికి కారణం ఆందోళనకారులను బలప్రయోగంతో అణచివేయాలని అక్కడి ప్రభుత్వం భావించడమేనని అంతర్జాతీయ అంశాల విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. రెండు రోజుల క్రితం లంక రాజధాని కొలంబో సమీపంలోని రాంబక్కన్ పట్టణంలో ప్రజలు నిర్వహిస్తున్న ఆందోళనలో హింస చోటుచేసుకుంది.…
తీవ్ర ఆర్థిక, ఆహార సంక్షోభంతో కొట్టుమిట్టాడుతున్న శ్రీలంకలో ప్రజాగ్రహం పెల్లుబుకుతోంది. ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రజాగ్రహ జ్వాలలు రగులుతూనే ఉన్నాయి. గొటబాయ రాజపక్స ప్రభుత్వానికి వ్యతిరేకంగా దేశ వ్యాప్తంగా నిరసనలు కొనసాగుతూనే ఉన్నాయి. రాజధాని కొలంబోలోని అధ్యక్ష కార్యాలయం ముందు భారీ సంఖ్యలో ప్రజలు గుమిగూడి నిరసనలు తెలుపుతున్నారు. ప్రభుత్వ వ్యతిరేక నిరసనలు మంగళవారం హింసాత్మకంగా మారాయి. శ్రీలంక నైరుతి ప్రాంతమైన రాంబుక్కనలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఇంధన ధరలు పెరగడాన్ని నిరసిస్తూ ఆందోళనకారులు రోడ్లపైకి వచ్చి ప్రభుత్వానికి…
తీవ్ర ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న శ్రీలంక చేతులెత్తేసింది.. కష్టాల నుంచి బయటపడడానికి వరుసగా ధరలను పెంచేస్తోంది.. ఇప్పటికే అప్పులు కట్టడం మా వల్ల కాదు బాబోయ్ అంటూ చేతులెత్తేసింది ఆ దేశ ప్రభుత్వం.. మరోసారి పెట్రో ధరలను పెంచింది.. దీంతో ప్రభుత్వానికి వ్యతిరేకంగా చేపట్టిన నిరసన, ఆందోళన కార్యక్రమాలు ఉద్రిక్తతలకు దారి తీశాయి.. పెట్రోలు, డీజల్ ధరలను మరింత పెంచింది శ్రీలంక ప్రభుత్వం.. తాజా పెంపుతో శ్రీలంకలో లీటర్ పెట్రోల్ ధర 338 రూపాయలకు చేరగా.. లీటరు…
తీవ్ర ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న శ్రీలంక చేతులెత్తేసింది.. అప్పులు కట్టడం మా వల్ల కాదు బాబోయ్ అంటూ తేల్చేసింది… ఇప్పటికే అధ్యక్షుడు గొటబాయ రాజపక్స రాజీనామా కోసం ఒత్తిడి పెరుగుతోంది. అధ్యక్షుడి సెక్రటేరియట్ వద్ద నిరసనలు హోరెత్తాయి. నిరసనకారులు ‘గో హోమ్ గొట’ అంటూ అధ్యక్షుడి రాజీనామా కోసం పెద్దపెట్టున నినాదాలు చేశారు. తమకు కరెంట్, గ్యాస్, పెట్రోల్, మెడిసిన్ లేవు… అందుకే ఆందోళన చేస్తున్నామని తెలిపారు. రాజపక్సే రాజీనామా చేయాల్సిందేనని నిరసనకారులు పట్టుబట్టారు. అయితే, అధ్యక్షుడి…
శ్రీలంకలో ఆర్థిక సంక్షోభం ముదురుతోంది. ప్రజలు ఆకలితో అలమటించే పరిస్థితులు పొంచి ఉన్నాయనే వార్తలు లంక వాసులను కలవరపెడుతున్నాయి. నిత్యావసరాల కోసం షాపుల ముందు బారులు తీరారు. ఒక్క పాలపొడి ప్యాకెట్‌ను తీసుకునేందుకు గంటల తరబడి పడిగాపులు పడుతున్నారు. లంకలో ఎక్కడ చూసినా ఇలాంటి దృశ్యాలే కనిపిస్తున్నాయి. చమురు, గ్యాస్, ఔషధాలు, ఆహార కొరతతో పాటు విద్యుత్ కోతలు మరింత ఎక్కువయ్యాయి. ఇంధన ధరలు, నిత్యావసరాలు ఆకాశాన్ని తాకడంతో.. తినడానికి నానా అవస్థలు పడుతున్న జనం.. రాజపక్స…