నేనా నా కెరీర్ లో చివరి దశలో ఉన్నాను అని ఎంఎస్ ధోని వ్యాఖ్యానించాడు. ఆ విషయం నాకు బాగా తెలుసు.. కాబట్టి ప్రతీ మ్యాచ్ ను నేను ఆస్వాదించడానికి ప్రయత్నిస్తున్నాను.. నాకు చెన్నైతో విడదీయరాని అనుబంధం ఉంది.
చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ ధోని సన్ రైజర్స్ హైదరాబాద్ యువ ఆటగాళ్లను కలిశాడు. ఉమ్రాన్ మాలిక్, వాషింగ్టన్ సుందర్, అభిషేక్ వర్మ, మయాంక్ డాగర్ సహా ఇతర ఆటగాళ్లు ధోని చెప్పిన సలహాలను శ్రద్ధగా వినడం ఆసక్తి కలిగించింది.
ఇండియన్ ప్రీమియర్ లీగ్ సీజన్ 16లో భాగంగా ఇవాళ ( శుక్రవారం ) కీలక మ్యాచ్ కు చెన్నై వేదికగా మారింది. ఎంఏ చిదంబరం స్టేడియంలో ఈ కీలక లీగ్ మ్యాచ్ జరుగనుంది.
కేకేఆర్ బ్యాటింగ్ పవర్ ముందు మేము ఇచ్చిన టార్గెట్ చిన్నబోతుందని భావించాం.. కానీ మా బౌలర్లు అద్భుతంగా రాణించారు. భువీ తన అనుభవం మొత్తం చూపించాడు.. అదే విధంగా మాకు బ్యాటింగ్ లో అద్భుతమైన ఆరంభం లభించిందని మార్ర్కమ్ అన్నారు.
నేను ఐపీఎల్ ఆడుతున్నానని తెలిసి నా ఫ్యామిలీ మొత్తం వచ్చింది. కొన్ని కారణాల వల్ల వాళ్లు వెళ్లిపోయారు. కానీ నా గర్ల్ ఫ్రెండ్ మాత్రం ఇక్కడే ఉంది. నా ఇన్సింగ్స్ ను బాగా ఎంజాయ్ చేసింది. ఈ రోజు నా ప్రదర్శనపై ఫ్యామిలీ మొత్తం సంతోషంగా ఉందని భావిస్తున్నా అంటూ హ్యారీ బ్రూక్ తెలిపాడు.
కెప్టెన్ మార్ర్కమ్.. తమ బౌలర్లపై నమ్మకం ఉందంటూ ధీమా వ్యక్తం చేశాడు. కేకేఆర్ కు గత రెండు మ్యాచ్ లలో విజయాలు అందించిన శార్థూల్ ఠాకూర్, రింకూ సింగ్ లను చూసి తామేమీ భయపడటం లేదని.. వాళ్లను కట్టడి చేసే వ్యూహాలు తమ దగ్గర ఉన్నాయని పేర్కొన్నాడు.
సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టుకు కెప్టెన్ మారినా తలరాత మారడం లేదు. వేలంలో సైతం పెద్ద ఆటగాళ్లను కొనుగోలు చేయడంలో యాజమాన్యం చేసిన తప్పులే ఇప్పుడు వరుసగా ఓటములకు కారణాలు అని చెప్పాలి. ఇక ఈ రోజు జరుగనున్న మ్యాచ్ లో మొదటి విజయం కోసం మార్క్రమ్ సేన బరిలోకి దిగుతుంది.
లక్నో సూపర్ జెయింట్స్ కెప్టెన్ కేఎల్ రాహుల్ స్పందించారు. ఈ అద్భుతమైన విజయానికి కారణం తమ జట్టు స్పిన్నర్లే అని రాహుల్ అన్నారు. ఈ మ్యాచ్ లో స్పిన్నర్లు అద్భుతంగా రాణించారు.