SRH vs RR Qualifier 2 Prediction: ఐపీఎల్ 2024లో నేడు క్వాలిఫయర్-2 జరగనుంది. పాయింట్ల పట్టికలో రెండు, మూడు స్థానాల్లో నిలిచిన సన్‌రైజర్స్ హైదరాబాద్, రాజస్తాన్ రాయల్స్ క్వాలిఫయర్–2 సమరానికి సిద్ధమయ్యాయి. చెన్నైలోని చెపాక్ మైదానంలో శుక్రవారం రాత్రి 7.30కు మ్యాచ్ ఆరంభం కానుంది. ఈ మ్యాచ్‌లో గెలిచిన జట్టు ఆదివారం కోల్‌కతా నైట్ రైడర్స్‌తో జరిగే ఫైనల్‌లో తలపడుతుంది. ఓడిన జట్టు ఇంటికెళుతుంది. ఈ నేపథ్యంలో మ్యాచ్ రసవత్తరంగా సాగనుంది. క్వాలిఫయర్-1లో కోల్‌కతా చేతిలో…