Minister KTR: ఎస్ ఆర్ డీపీ ప్రాజెక్టు సీఎం కేసీఆర్ మానస పుత్రిక అని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ అన్నారు. శాసనసభలో ప్రశ్నోత్తరాల సందర్భంలో హైదరాబాద్ నగరంలో ఎస్ ఆర్ డీపీ పనుల పురోగతిపై సభ్యులు అడిగిన ప్రశ్నలకు మంత్రి కేటీఆర్ సమాధానమిచ్చారు.
ఒకప్పుడు హైదరాబాద్ అంటే ట్రాఫిక్ జాంలు, కాలుష్యం.. కానీ ఇప్పుడు నగరం తీరు మారింది. నగరం అంతా పచ్చదనం పరుచుకుంటోంది. కాంక్రీట్ తో కట్టుకున్న ఫ్లై ఓవర్లు కింద పచ్చని మొక్కలు కనిపిస్తూ మనసుకు ఆహ్లాదాన్ని పంచుతున్నాయి. అసలు మనం సిటీలోనే వున్నామా.. ఇన్ని ఫ్లై ఓవర్లున్నా అంతగా కాలుష్యం రావడం లేదని అంతా అవాక్కవుతున్నారు. గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కార్పోరేషన్ చేపడుతున్న వివిధ ఇన్ ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్టులు శరవేగంగా పూర్తవుతున్నాయి. హైదరాబాద్‌లో షేక్ పేటలో నిర్మాణమవుతున్న…