టీడీపీకి మాజీ మంత్రి గంటా ఝలక్..! తెలుగుదేశం పార్టీకి గుడ్‌బై చెప్పేందుకు సిద్ధమయ్యారు సీనియర్ పొలిటీషియన్, మాజీ మంత్రి, టీడీపీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాస్‌రావు.. ఎప్పటి నుంచో ఈ ప్రచారం సాగుతున్నా.. ఫైనల్‌గా డిసెంబర్ నెలలో ఆయన వైసీపీ తీర్థం పుచ్చుకోనున్నారట.. తెలుగుదేశం పార్టీకి గుడ్‌బై చెప్పి.. వైసీపీలో చేరనున్నట్టు తన సన్నిహితుల దగ్గర గంటా శ్రీనివాస్‌రావు చర్చించినట్టుగా సమాచారం.. అయితే, పార్టీని వీడేకంటే ముందు మెగాస్టార్ చిరంజీవితో ఆయనే సమావేశం కానున్నారట.. హైదరాబాద్ వెళ్లనున్న గంటా…
Be Ready with B Better: కాసులు లేకపోయినా పర్లేదు గానీ కాలూ చెయ్యీ బాగుంటే చాలు.. అదే పది వేలు.. అంటుంటారు పెద్దలు. ఇది అక్షర సత్యం. లక్షల విలువ చేసే మాట. కానీ.. ఫిట్నెస్ విషయంలో అప్పటివాళ్లకు, ఇప్పటివాళ్లకు చాలా తేడా ఉంది. ఆ రోజుల్లో ఆహారపు అలవాట్లు వేరు. వాళ్ల జీవన శైలి సైతం ఎంతో విభిన్నంగా ఉండేది. ప్రజెంట్ జనరేషన్ లైఫ్ స్టైల్‌కి అస్సలు పోలికే లేదు. అందుకే ఆ తరంవాళ్లు…
మహిళల ఆసియా కప్ టీ-20 క్రికెట్ టోర్నీలో ఇప్పటికే సెమీఫైనల్‌కు అర్హత సాధించిన భారత జట్టు నేడు థాయ్‌లాండ్‌తో అమీతుమీకి సిద్ధమైంది. సెమీ ఫైనల్ చేరుకున్న భారత్ నేడు చివరి లీగ్ మ్యాచ్‌ను ఆడనుంది.
బర్మింగ్ హామ్ వేదికగా.. కామన్వెల్త్ క్రీడలు అట్టహాసంగా జరుగుతున్నాయి. ఈ క్రమమంలో.. క్రీడల్లో ఓ అపశ్రుతి చోటుచేసుకుంది. 10కి.మీ స్క్రాచ్ రేసులో భారత సైక్లిస్ట్ మీనాక్షి అదుపుతప్పి కిందపడడ్డారు.. దీంతో వెనుకనుండి వస్తున్న ప్రత్యర్థి న్యూజిల్యాండ్ సైక్లిస్ట్ బ్రయానీ బోథా సైకిల్ మీనాక్షి పై నుంచి దూసుకెళ్లడంతో.. తీవ్రంగా గాయపడింది. అక్కడున్న పోటీ నిర్వాహకులు వెంటనే స్పందించి మీనాక్షిని స్ర్టెచర్ పై తీసుకెళ్లారు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. read…
Commonwealth games meera bai chanu won the gold medal: కామన్వెల్త్ గేమ్స్ లో భారత క్రీడాకారులు సత్తా చాటుతున్నారు. ఇప్పటికే రెండు పతకాలను గెలుచుకోగా.. తాజాగా మరో పతకాన్ని ఇండియా కైవసం చేసుకుంది. భారత స్టార్ వెయిట్ లిఫ్టర్ మీరాబాయి చాను ఏకంగా స్వర్ణాన్ని గెలుచుకుంది. దీంతో భారత్ ఇప్పటి వరకు మూడు పతకాలను కైవసం చేసుకుంది.
ఇండోనేసియా ఓపెన్ ప్రపంచ టూర్ సూపర్-1000 బ్యాడ్మింటన్ టోర్నీలో భారత షట్లర్ల పేలవ ప్రదర్శన కొనసాగుతోంది. టోర్నీ నుంచి భారత స్టార్ షట్లర్ కిదాంబి శ్రీకాంత్ నిష్క్రమించాడు. ప్రపంచ 11వ ర్యాంకర్ శ్రీకాంత్‌కు తొలి రౌండ్లోనే ఊహించని పరాజయం ఎదురైంది. బుధవారం జరిగిన మ్యాచ్‌లో 21-23, 10-21తో 41వ ర్యాంకర్ బ్రైస్ లెవెర్‌దెజ్ (ఫ్రాన్స్) చేతిలో అతడు ఓటమి పాలయ్యాడు. గతంలో లెవెర్డెజ్తో ఆడిన ఐదుసార్లూ గెలిచిన శ్రీకాంత్ ఆరోసారి మాత్రం ఓటమి చవిచూశాడు. 42 నిమిషాల్లో…
ఇండోనేసియా బ్యాడ్మింటన్ టోర్నీలో క్వార్టర్ఫైనల్లో ప్రవేశించింది భారత స్టార్ షట్లర్ పీవీ సింధు.గురువారం హోరాహోరీగా సాగిన ప్రిక్వార్టర్స్ మ్యాచ్‌లో నాలుగో సీడ్ సింధు 23–21, 20–22, 21–11తో గ్రెగోరియా మరిస్క టుంజుంగ్ (ఇండోనేసియా)పై చెమటోడ్చి గెలిచింది. ప్రపంచ ర్యాంకింగ్స్‌లో 30వ స్థానంలో ఉన్న స్థానిక క్రీడాకారిణి గ్రెగొరియా సొంత ప్రేక్షకుల మధ్య సింధుకు తొలి రెండు గేమ్‌లలో గట్టి పోటీనిచ్చింది. తొలి గేమ్ ఆరంభంలో దూకుడుగానే ఆడిన భారత స్టార్ 10-5తో సులభంగా గేమ్ గెలిచేలా కనిపించింది.…
ఆసియా కప్ హాకీ టోర్నమెంట్ లో భారత పురుషుల జట్టును దురదృష్టం వెంటాడింది. సూపర్ 4 లో భాగంగా మంగళవారం దక్షిణ కొరియా తో జరిగిన మ్యాచ్ ను భారత జట్టు 4-4తో డ్రాగా ముగించింది. తప్పక గెలవాల్సిన చోట భారత్ జట్టు మ్యాచ్ ను డ్రా చేసుకోవడంతో గోల్స్ తేడాతో ఫైనల్ చేరే అవకాశాన్ని కోల్పోయింది. మరో మ్యాచ్ లో జపాన్ పై మలేసియా విజయం సాధించింది. దాంతో మలేసియా, దక్షిణ కొరియా, భారత్ జట్లు…