IND vs ZIM: 134 పరుగులకే జింబాబ్వే ఆలౌట్.. భారత్ ఘన విజయం
- రెండో టీ-20లో జింబాబ్వే భారత్ ఘన విజయం
- 134 పరుగులకే జింబాబ్వే ఆలౌట్
- 100 పరుగుల తేడాతో గెలిచిన టీమిండియా.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
IND vs ZIM: జింబాబ్వేతో జరుగుతున్న ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో తొలి మ్యాచ్‌లో అనూహ్య ఓటమి చవిచూసిన ఒక్కరోజు తర్వాత అదే గడ్డపై యువ టీమిండియా భీకర ప్రదర్శనను కనిబరిచింది. జింబాబ్వేతో జరిగిన రెండో టీ-20లో 100 పరుగుల భారీ తేడాతో భారత్ ఘన విజయం సాధించింది. 235 పరుగుల లక్ష్యఛేదనకు బరిలోకి దిగిన జింబాబ్వే బ్యాటర్లు టీమిండియా బౌలర్ల ధాటికి నిలవలేకపోయారు. తొలి ఓవర్‌లోనే జింబాబ్వే వికెట్ల పతనం మొదలైంది. దీంతో ఆ జట్టు ఇన్నింగ్స్ 19వ ఓవర్లో 134 పరుగులకే కుప్పకూలింది. ఈ విజయంతో భారత్ సిరీస్ 1-1తో సమమైంది.18.4 ఓవర్లలో 134 పరుగులకే జింబాబ్వే ఆలౌట్ అయింది. జింబాబ్వే తరఫున వెస్లీ మాధేవెరే టాప్ ఇన్నింగ్స్‌లో 43 పరుగులు చేశాడు, అయితే అతను 39 బంతులు ఎదుర్కొన్నాడు. లోయర్ ఆర్డర్‌లో ల్యూక్ జోంగ్వే 33 పరుగులు చేశాడు. భారత బౌలర్లలో ముకేశ్ కుమార్, అవేశ్ ఖాన్ తలో మూడు వికెట్లు పడగొట్టగా.. రవి భిష్ణోయ్ రెండు వికెట్లు తీశారు. వాషింగ్టన్ సుందర్ ఓ వికెట్ తీశాడు.
Read Also: IND vs ZIM: అభిషేక్, రుతురాజ్ ఊచకోత.. జింబాబ్వే ఎదుట భారీ లక్ష్యం
Also Read
- Hasan Nawaz: భారత జట్టు చేతిలో ఓటమిని తట్టుకోలేకపోతున్నా.. పాకిస్థాన్ ప్లేయర్ ఆవేదన..
- Ajit Agarkar: భారత క్రికెట్ చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ గుడ్ బై..
- Smriti Mandhana: స్మృతి మంధాన భావోద్వేగ పోస్టు.. ఆమె సేవలు మరువలేనివంటూ..
- India Womens Squad: జింబాబ్వేతో టీ20, వన్డే సిరీస్‌లు.. భారత మహిళా జట్టును ప్రకటించిన బీసీసీఐ..
తొలుత టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న టీమిండియా.. అభిషేక్ శర్మ(100), రుతురాజ్ గైక్వాడ్(77), రింకూ సింగ్(48) విజృంభించడంతో 234 పరుగుల భారీ స్కోర్‌ను సాధించింది. అభిషేక్ శర్మ 47 బంతుల్లో 7 ఫోర్లు, 8 సిక్సర్లతో 100 పరుగులు చేశాడు. రింకూ సింగ్ 22 బంతుల్లోనే 48 పరుగులు చేయడం గమనార్హం. భారత్ కేవలం 2 వికెట్లు మాత్రమే కోల్పోయి 234 పరుగులు చేసింది. జింబాబ్వే బౌలర్లలో మసకద్జ, ముజరబాని తలో వికెట్ సాధించారు. టీమిండియా ఈ విజయంతో 5 టీ-20ల సిరీస్‌ను 1-1తో సమం చేసింది.
తాజావార్తలు
-
Hasan Nawaz: భారత జట్టు చేతిలో ఓటమిని తట్టుకోలేకపోతున్నా.. పాకిస్థాన్ ప్లేయర్ ఆవేదన..
-
CM Revanth Reddy : ప్రజాస్వామ్యాన్ని పరిరక్షణకే పార్లమెంట్ వరకు పోరు
-
Bangladesh: ఉండేది పూరి గుడిసె.. 21 మంది భార్యలు..వైరల్‌గా బిచ్చగాడి స్టోరీ
-
Mokshagna: మోక్షజ్ఞ డెబ్యూ మూవీ అప్డేట్.. షూటింగ్ మొదలయ్యేది అప్పుడేనట!
-
Ajit Agarkar: భారత క్రికెట్ చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ గుడ్ బై..
ట్రెండింగ్
-
Viral Video: రామనామం పవర్ ఇదేనా? మహిళ ‘శ్రీరామ్’ అనగానే కోతి మైండ్ బ్లోయింగ్ రియాక్షన్.. వీడియో వైరల్!
-
Oil Less Vada: చుక్క నూనె లేకుండా, పప్పు నానబెట్టకుండా.. దూదిలాంటి సాఫ్ట్ వడలు చిటికెలో చేయండి ఇలా..!
-
రూ.10,999కే 120Hz డిస్‌ప్లే, 5,000mAh బ్యాటరీతో Infinix Smart 20 HD లాంచ్..!
-
Woolen Clothes: స్వెటర్లపై చిన్న చిన్న రోమాలు పోవడం లేదా? ఈ 2 నిమిషాల హోమ్ ట్రిక్స్‌తో కొత్తవాటిలా మార్చేయండి!
-
Tollywood Most Eligible Bachelors: పెళ్లా? మాకా?!.. వయస్సు ముదురుతున్న ‘నిత్య బ్రహ్మచారి’ బిరుదును వదలని హీరోలు.!