తిరుపతి.. కలియుగ వైకుంఠంగా ప్రసిద్ధి. ఈ నగరంలో పగలు, ప్రతీకారాలు, దొంగతనాలు తక్కువగా నమోదవుతుంటాయి. రాజకీయ దాడులు పక్కన పెడితే నేరాల సంఖ్య తక్కువే. అయితే ఈ మధ్యకాలంలో దొంగతనాలు తిరుపతి వాసుల గుండెల్లో గుబులు రేపుతున్నాయి. తిరుపతి సమీప ప్రాంతాల్లో ఆగని చోరీలు భయాందోళనలు కలిగిస్తున్నాయి. తిరుపతిలో అర్బన్ జిల్లా పోలీసు యంత్రాంగానికి దొంగతనాలు సవాల్ విసురుతున్నాయి. శ్రీనివాసమంగాపురంలో రాత్రి ఇంటి తాళాలు పగలగొట్టి లోనికి ప్రవేశించారు దొంగలు. బీరువాలోని రూ.50వేల నగదు, 24గ్రాముల బంగారం…