జనాభా పెరగాలని ఇప్పటికే స్పష్టం చేశారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు.. అయితే, జనాభా పెరగడం వల్ల అనేక ఇబ్బందులు వస్తాయనే చర్చ కూడా మరోవైపు సాగుతోంది.. దీంతో 20 రోజుల పాటు ప్రత్యేక సర్వే నిర్వహించడానికి సిద్ధమైంది ప్రభుత్వం.. వైద్య ఆరోగ్య.. మహిళా శిశు సంక్షేమ శాఖలకు ఈ బాధ్యతలు అప్పగించారు.. ప్రతి ఇంటిలో సర్వే నిర్వహించి.. వారి అభిప్రాయాలు సేకరించబోతున్నారు..