Government Survey: గతంలో జనాభా నియంత్రణకు ప్రభుత్వం తీసుకున్న చర్యలతో కుటుంబ నియంత్రణతో జానాభా తగ్గుముఖం పట్టింది.. అయితే, దక్షిణాది రాష్ట్రాల్లో జనాభా నియంత్రణ జరిగినా ఉత్తరాధి రాష్ట్రాల్లో మాత్రం.. జనాభా పెరుగుతూ పోయింది.. ఇప్పుడు, ఇది దక్షిణాది ప్రాంతానికి పెను ముప్పుగా మారిందనే చర్చ సాగుతోంది.. ఆర్థికంగా, రాజకీయంగా కూడా దక్షిణాది రాష్ట్రాలకు తీవ్ర నష్టం జరుగుతోన్న నేపథ్యంలో.. ఇప్పుడు మళ్లీ పిల్లలను కనండి.. అంటూ పాలకులు ప్రోత్సహిస్తున్నారు.. అయితే, ప్రభుత్వ పెద్దల మాట ఇలా ఉన్నా..? ప్రజల్లో దీనిపై ఎలాంటి అభిప్రాయం ఉందో తెలుసుకున్న ప్రయత్నం చేస్తోంది ఏపీ సర్కార్.. అందులో భాగంగా.. జనాభా పెరుగుదల అంశానికి సంబంధించి ప్రజాభిప్రాయ సేకరణ నిర్వహించాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయించింది..
Read Also: PM Modi: ఆపరేషన్ సిందూర్ సమయంలో బ్రహ్మోస్ శత్రువులకు నిద్ర లేకుండా చేశాయి
జనాభా పెరగాలని ఇప్పటికే స్పష్టం చేశారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు.. అయితే, జనాభా పెరగడం వల్ల అనేక ఇబ్బందులు వస్తాయనే చర్చ కూడా మరోవైపు సాగుతోంది.. దీంతో 20 రోజుల పాటు ప్రత్యేక సర్వే నిర్వహించడానికి సిద్ధమైంది ప్రభుత్వం.. వైద్య ఆరోగ్య.. మహిళా శిశు సంక్షేమ శాఖలకు ఈ బాధ్యతలు అప్పగించారు.. ప్రతి ఇంటిలో సర్వే నిర్వహించి.. వారి అభిప్రాయాలు సేకరించబోతున్నారు.. రాష్ట్రవ్యాప్తంగా 20 రోజుల పాటు సర్వే నిర్వహించబోతున్నారట.. ప్రస్తుతం ఉన్న ఆర్ధిక పరిస్థితులు.. ఎక్కువ మంది పిల్లలు ఉంటే వచ్చే ఇబ్బందులు.. ప్రభుత్వం నుంచి కోరుకునే సౌకర్యాలపై కొన్ని ప్రశ్నలు ఆధారంగా ఈ సర్వే నిర్వహించబోతున్నారు..