బీహార్‌కు కేంద్రం ప్రత్యేక హోదా ఇవ్వలేమని తేల్చిచెప్పిన నేపథ్యంలో ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఎన్డీఏ నుంచి నితీష్ కుమార్ బయటకు రావాలని.. ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.
కేంద్రంలో మోడీ 3.0 సర్కార్ ఏర్పడిన తర్వాత లేటెస్ట్‌గా ప్రత్యేక హోదా అంశం తెరపైకి వచ్చింది. ఎన్డీఏ మిత్ర పక్షాల నుంచే ఈ డిమాండ్ రావడం ప్రాధాన్యత సంతరించుకుంది. కేంద్రంలో మోడీ ప్రభుత్వం ప్రస్తుతం మిత్ర పక్షాల సపోర్ట్ పిల్లర్స్‌పై ఆధారపడి ఉంది.