(జూన్ 4న బాలు జయంతి)‘ఎవరన్నారు బాలు లేరని…!?’ ఈ మాటలు తెలుగువారి నోట పలుకుతూనే ఉంటాయి. ఎందుకంటే బాలు పాటలోని మాధుర్యం మనకే కాదు, యావద్భారతానికీ తెలుసు. బాలు తెలుగువారయినందుకు మనమంతా గర్విస్తూ పై విధంగా చెబుతూ ఉంటాం. అవును, ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం లేరని ఎవరన్నారు. అని మనగలమా? బాలు పాట తెలుగువారి ఆస్తి. దానిని దొంగిలించడం ఎవరి తరమూ కాదు. భౌతికంగా బాలును తీసుకు పోగలిగిన విధి బాలు పాటను, ఆయన పంచిన మధురామృతాన్నీ మన…