తెలుగు ఇండియన్ ఐడల్ లోని కంటెస్టెంట్స్ ఈ వీకెండ్ గాన గాంధర్వుడు ఎస్పీ బాల సుబ్రహ్మణ్యం పాటలతో వీక్షకులను అలరించారు. ఎస్పీ చరణ్ తో పాటు 'దసరా'తో గ్రాండ్ విక్టరీని సొంతం చేసుకున్న నాని సైతం ఈ కార్యక్రమంలో పాల్గొనడం విశేషం.
ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం నోట ఏ మాట పలికినా, అది మధురామృతంగా మారిపోతుందని అందరికీ తెలుసు. సందర్భానుసారంగా తన స్వరాన్ని సవరించుకొనే బాలు నటుల విలక్షణమైన వేషధారణలోనూ అందుకు తగ్గట్టుగా గానం చేసి మురిపించారు. ఇక ఆయనతో పాటు ఇలాంటి పాటల్లో గళం విప్పడానికి సాటి గాయకులు సైతం ఉత్సాహంతో ఉరకలేసి మరీ పాడారు. తెలుగు చిత్రసీమలోని టాప్ స్టార్స్ అందరికీ ఒకప్పుడు ఎస్పీ బాలు గాత్రం తప్ప మరో ఆధారం లేదు. ఇక టాప్ హీరోస్ వరైటీ…
వీబీ ఎంటర్‌టైన్మెంట్స్ సంస్థ 2014 నుండి తెలుగు ఫిల్మ్, టీవీ డైరెక్టరీ ప్రచురిస్తూ బుల్లితెర అవార్డులతో పాటు వెండితెర అవార్డులనూ అందిస్తోంది. వీబీ ఎంటర్‌టైన్మెంట్స్ అధినేత విష్ణు బొప్పన ప్రతి ఏడాది లాగే ఈ ఏడాదికి సంబంధించిన సినిమా తారల డైరీని రూపొందించారు. ఈ డైరీని గానగంధర్వ, పద్మవిభూషణ్ ఎస్. పి. బాలసుబ్రమణ్యంకు అంకితమిచ్చారు. ఈ డైరీ ఆవిష్కరణ కార్యక్రమం శనివారం ప్రసాద్ ల్యాబ్ లో సినీప్రముఖుల సమక్షంలో జరిగింది. ‘మా’ అధ్యక్షులు వి.కె. నరేష్ డైరీని…
శ్రీ పండితారాద్యుల బాలసుబ్రహ్మణ్యం అంటే అందరికి తెలియకపోవచ్చు .. కానీ ఎస్పీ బాలు అంటే చాలు.. మధురమైన గీతాలే గుర్తొస్తాయి. ఒక్క తెలుగులోనే కాదు దాదాపు అన్ని భాషల్లో కలిపి నలభైవేలకు పైగా పాటలు పాడిన మహా గాయకుడు బాలు!! బాలసుబ్రహ్మణ్యం ఆకస్మిక మరణం సంగీత ప్రపంచానికి తీరని లోటు. ఆయన లేని లోటు ఎప్పటికి తీర్చ లేనిది. జూన్ 4న శుక్రవారం ఆయన 75వ పుట్టినరోజు. ఆయన జయంతి సందర్బంగా యావత్ తెలుగు చిత్రసీమ ఆయనకు…
బాలు జయంతి సందర్భంగా ఆయనతో ఉన్న అనుబంధాన్ని గుర్తుచేసుకున్నారు ప్రముఖ సంగీత దర్శకులు మణిశర్మ. “బాలు అన్నయ్యతో నా అనుబంధం చాలా దశలలో జరిగింది. నా టీనేజ్ లో మా నాన్నగారు బాలు గారు గొంతును సందర్భాను సారంగా మార్చి ఎలా పాడతారో చెప్పినప్పుడు ఆశ్చర్య పోయే వాడిని. ఆ తర్వాత ఇళయరాజా గారి బాణీలకు బాలు గారు పాటలు పాడటం చూసి అద్భుతం అనుకునే వాడిని. నేను వాద్యకారుడుగా మారిన కొత్తలో బాలుగారు పాడుతుంటే నాన్న…
గాన గంధర్వుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం జయంతి నేడు. ఈ సందర్భంగా ఆయనకు నివాళులు అర్పించారు మెగాస్టార్ చిరంజీవి. “అనితర సాధ్యుడు, మహా గాయకుడు, ప్రియ సోదరుడైన బాలు గారికి ఓ చెల్లి అశ్రు నీరాజనం..మనందరినీ శోక సముద్రంలో ముంచి ఇంత త్వరగా వీడి వెళ్లిన ఆ గాన గంధర్వుడి 75 వ జన్మ దిన సంధర్బంగా ఈ స్మృత్యంజలి..వినమ్ర నివాళి !” అంటూ ఓ వీడియోను షేర్ చేశారు. ఆ వీడియోలో బాలు పిక్స్ ఉండగా… ఎస్పీ…
(జూన్ 4న బాలు జయంతి)‘ఎవరన్నారు బాలు లేరని…!?’ ఈ మాటలు తెలుగువారి నోట పలుకుతూనే ఉంటాయి. ఎందుకంటే బాలు పాటలోని మాధుర్యం మనకే కాదు, యావద్భారతానికీ తెలుసు. బాలు తెలుగువారయినందుకు మనమంతా గర్విస్తూ పై విధంగా చెబుతూ ఉంటాం. అవును, ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం లేరని ఎవరన్నారు. అని మనగలమా? బాలు పాట తెలుగువారి ఆస్తి. దానిని దొంగిలించడం ఎవరి తరమూ కాదు. భౌతికంగా బాలును తీసుకు పోగలిగిన విధి బాలు పాటను, ఆయన పంచిన మధురామృతాన్నీ మన…
గాన గంధర్వుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యంకు తెలుగు చిత్ర సీమ గ్రాండ్ ట్రిబ్యూట్ నిర్వహించబోతోంది. ఈ కార్యక్రమంపై డైరెక్టర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు ఎన్. శంకర్ మాట్లాడుతూ ‘బాలూ గారి జయంతిని పురస్కరించుకుని తెలుగు సినీ పరిశ్రమకు చెందిన వారంతా ఆరోజుని బాలుగారికి అంకితం చేయాలని నిర్ణయించుకున్నారు. వారి గౌరవార్థం తెలుగు సినిమాకే కాకుండా భారతీయ సినిమాకి బాలుగారు చేసిన సేవల్ని గుర్తుచేస్తూ సినీ ప్రముఖులంతా ఇందులో పాల్గొనబోతున్నారు. ఇది దాదాపు 12 గంటలపాటు లైవ్ ప్రోగ్రామ్ గా కొనసాగుతుంది.…
తల్లిదండ్రులు భౌతికంగా దూరమైనా… ప్రతి రోజు మనం చేసే పని, ప్రవర్తనతో వారిని తలుచుకుంటూనే ఉంటాం. గాన గాంధర్వుడు ఎస్పీ బాల సుబ్రహ్మణ్యం కన్నుమూసి ఎనిమిది నెలలు గడిచిపోయింది. అయినా ఇవాళ్టికీ కోట్లాది మంది పెదవులపై ఆయన పాడిన పాటలు అనునిత్యం పల్లవిస్తూనే ఉన్నాయి. అయితే… ఆయన లేని లోటును ఎక్కువగా ఫీల్ అయ్యేది ఖచ్చితంగా ఆయన కుమారుడు ఎస్పీ చరణే! అతను ఏం చేసినా… తండ్రి ఉన్నప్పుడు – లేనప్పుడు అందులో వ్యత్యాసాన్ని బాగా పోల్చుకుంటున్నట్టు…