Spain Floods : స్పెయిన్‌లో వరదలు బీభత్సం సృష్టించాయి. దీంతో పరిస్థితి దారుణంగా మారింది. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా చుట్టుపక్కల నీరు కనిపిస్తోంది.
భారీ వరదలు స్పెయిన్‌ను అతలాకుతలం చేశాయి. గత 37 ఏళ్లలో ఎన్నడూ ఎరుగని రీతిలో అత్యంత ఘోరంగా వరదలు హడలెత్తించాయి. ఇప్పటికే 100 మంది చనిపోగా.. వందలాది మంది వరదల్లో కొట్టుకుపోయారు.
Spain Floods: స్పెయిన్‌లో ప్రస్తుతం పరిస్థితులు బాగా లేవు. వర్షాలు, వరదల కారణంగా ఇక్కడ బీభత్సం నెలకొంది. చాలా నగరాలు నీట మునిగాయి. ఈశాన్య స్పెయిన్‌లోని జరాగోజా నగరం పరిస్థితి మరీ దారుణంగా ఉంది.