తల్లిదండ్రులు భౌతికంగా దూరమైనా… ప్రతి రోజు మనం చేసే పని, ప్రవర్తనతో వారిని తలుచుకుంటూనే ఉంటాం. గాన గాంధర్వుడు ఎస్పీ బాల సుబ్రహ్మణ్యం కన్నుమూసి ఎనిమిది నెలలు గడిచిపోయింది. అయినా ఇవాళ్టికీ కోట్లాది మంది పెదవులపై ఆయన పాడిన పాటలు అనునిత్యం పల్లవిస్తూనే ఉన్నాయి. అయితే… ఆయన లేని లోటును ఎక్కువగా ఫీల్ అయ్యేది ఖచ్చితంగా ఆయన కుమారుడు ఎస్పీ చరణే! అతను ఏం చేసినా… తండ్రి ఉన్నప్పుడు – లేనప్పుడు అందులో వ్యత్యాసాన్ని బాగా పోల్చుకుంటున్నట్టు…