Quinton de Kock: క్వింటన్ డికాక్ అరుదైన ఘనత.. గిల్‌క్రిస్ట్, ధోనీకి కూడా సాధ్యం కాలేదు!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Not MS Dhoni and Gilchrist, Quinton de Kock scripts history in ODI World Cup: దక్షిణాఫ్రికా వికెట్ కీపర్ క్వింటన్ డికాక్ చివరి వన్డే ఇంటర్నేషనల్ మ్యాచ్ ఆడేశాడు. వన్డే వరల్డ్‌కప్ 2023లో భాగంగా గురువారం ఆస్ట్రేలియాతో జరిగిన రెండో సెమీ ఫైనల్ మ్యాచే డికాక్ కెరీర్‌లో చివరిది. తాను ఆడిన చివరి వన్డేలో డికాక్‌కు నిరాశే ఎదురైంది. సెమీ ఫైనల్లో 14 బంతుల్లో 3 పరుగులే చేసి పెవిలియన్ చేరాడు. అంతేకాదు నాకౌట్ మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా చేతులెత్తేసింది. అయితే డికాక్ తన కెరీర్ ఆఖరి వన్డే మ్యాచ్‌తో వరల్డ్‌కప్ రికార్డు నెలకొల్పాడు.
వన్డే వరల్డ్‌కప్ 2023లో 10 మ్యాచ్‌లు ఆడిన క్వింటన్ డికాక్.. 4 సెంచరీల సాయంతో 594 పరుగులు చేశాడు. విరాట్ కోహ్లీ (10 మ్యాచ్‌ల్లో 711 పరుగులు) తర్వాత సెకెండ్ లీడింగ్ రన్ స్కోరర్‌గా డికాక్ ఉన్నాడు. ఈ ఎడిషన్‌లో 594 పరుగులు మాత్రమే కాదు.. 20 క్యాచ్‌లు కూడా పట్టాడు. దాంతో ప్రపంచకప్ చరిత్రలో 500 ప్లస్ పరుగులు, 20 క్యాచ్‌లు పట్టిన తొలి వికెట్ కీపర్ కమ్ బ్యాటర్‌గా రికార్డులో నిలిచాడు. ఈ రికార్డు కీపింగ్ దిగ్గజాలు ఆడమ్ గిల్‌క్రిస్ట్, ఎంఎస్ ధోనీలకు కూడా సాధ్యం కాలేదు.
Also Read
- CM Vijay: త్రిషతో కలిసి విదేశాల్లో తిరుగుతారా? సీఎం విజయ్‌పై విపక్షాలు ధ్వజం
- Iran War: విమానం కూలింది.. ఎముకలు విరిగాయి.. అయినా వెనక్కి తగ్గలేదు.. ఇరాన్లో అమెరికా సైనికుడి పోరాటం
- Vaibhav Sooryavanshi: ‘నేను ఏం తప్పు చేశా..?’.. కోపంతో రగిలిపోతున్న వైభవ్ సూర్యవంశీ..
- Pakistan: "మక్కా ఒప్పందం అండగా లేదు".. సౌదీ-హౌతీ వార్‌లో పాకిస్తాన్ డ్యామెజ్ కంట్రోల్..
అంతేకాదు ఓ సింగిల్ వరల్డ్‌కప్ ఎడిషన్‌లో అత్యధిక క్యాచ్‌లు పట్టిన నాలుగో వికెట్ కీపర్‌గా క్వింటన్ డికాక్ రికార్డుల్లోకెక్కాడు. ఈ జాబితాలో ఆడమ్ గిల్‌క్రిస్ట్ (2003లో 21 క్యాచ్‌లు), టామ్ లాథమ్ (2019లో 21 క్యాచ్‌లు), అలెక్స్ క్యారీ (2019లో 20 క్యాచ్‌లు)లు డికాక్ కంటే ముందున్నారు. వన్డే వరల్డ్‌కప్ 2023 ఆరంభానికి ముందే డికాక్ తన వన్డే రిటైర్మెంట్ ప్రకటన చేసిన విషయం తెగెలిసిందే. టెస్ట్ మ్యాచ్‌లు, టీ20లలో మాత్రం అతడు కొనసాగుతాడు.
తాజావార్తలు
-
CM Vijay: త్రిషతో కలిసి విదేశాల్లో తిరుగుతారా? సీఎం విజయ్‌పై విపక్షాలు ధ్వజం
-
Iran War: విమానం కూలింది.. ఎముకలు విరిగాయి.. అయినా వెనక్కి తగ్గలేదు.. ఇరాన్లో అమెరికా సైనికుడి పోరాటం
-
Vaibhav Sooryavanshi: ‘నేను ఏం తప్పు చేశా..?’.. కోపంతో రగిలిపోతున్న వైభవ్ సూర్యవంశీ..
-
Director Shouryuv: నెట్‌ఫ్లిక్స్ సమర్పణలో ‘హాయ్ నాన్న’ డైరెక్టర్ లార్జర్-దేన్-లైఫ్ ప్రాజెక్ట్! అసలు కథ ఇదే..
-
Pakistan: “మక్కా ఒప్పందం అండగా లేదు”.. సౌదీ-హౌతీ వార్‌లో పాకిస్తాన్ డ్యామెజ్ కంట్రోల్..
ట్రెండింగ్
-
Ganga Aarti in London: లండన్‌లో తొలిసారి గంగా హారతి.. థేమ్స్ నది తీరంలో ఆధ్యాత్మిక సందడి.!
-
Ragi Drumstick Leaves Roti: డయాబెటిస్, బీపీ ఉన్నవారికి సంపూర్ణ ఆహారం.. సంపూర్ణ పోషణనిచ్చే ‘రాగి మునగాకు రొట్టె’ చేసేయండి ఇలా.!
-
Beetroot Pachadi: బీట్రూట్ అంటే నచ్చదా? ఇలా పచ్చడి చేసి పెట్టండి.. ప్లేట్ మొత్తం ఖాళీ చేసేస్తారు.!
-
India Women: నాలుగింటిలో నాలుగు.. ఆరింటిలో నాలుగు.. ఆసియా కప్‌లో భారత్ హవా!
-
Rajyogam: 200 ఏళ్ల తర్వాత అరుదైన యోగం.. ఈ 5 రాశుల వారికి పట్టిందల్లా బంగారమే..!