TRS రాజ్యసభ సభ్యుడు డి.శ్రీనివాస్.. కాంగ్రెస్ లో చేరడానికి ముహూర్తం ఖరారు అయింది. ఈ నెల 24న కాంగ్రెస్ అధినేత్రి సోనియా సమక్షంలో కాంగ్రెస్ కండువా కప్పుకోనున్నారు. 2014 సార్వత్రిక ఎన్నికల తర్వాత కారు ఎక్కిన ఆయన.. తిరిగి సొంత గూటికి వస్తున్నారు.
ధర్మపురి శ్రీనివాస్ తిరిగి కాంగ్రెస్ కండువా కప్పుకోనున్నారు. ఉమ్మడి రాష్ట్రంలో పీ సి సి అధ్యక్షుడిగా పనిచేశారు. 2015లో కేసీఆర్ సమక్షంలో గులాబీ కండువా కప్పుకున్నారు. పార్టీలో చేరిన వెంటనే తగిన ప్రాధాన్యత కల్పించారు గులాబీ బాస్. ప్రభుత్వ సలహాదారుగా బాధ్యతలు అప్పగించారు. ఆ తర్వాత 2016లో డీఎస్ ను రాజ్య సభకి పంపించారు.
ఆ తర్వాత జరిగిన పరిణామాలతో పార్టీకి, డీఎస్ కి గ్యాప్ పెరిగింది. పార్టీ వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడుతున్నారని నిజామాబాద్ టీఆర్ఎస్ నేతలు.. ఆయనను పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని అధిష్టానానికి లేఖ పంపించారు. దీనిపై పార్టీ అధిష్ఠానం ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు. డీఎస్ కూడా.. 2018 అసెంబ్లీ, 2019 పార్లమెంట్ ఎన్నికల్లో పార్టీ కి దూరంగానే ఉంటూ వస్తున్నారు…స్పాట్
డీఎస్ రాజ్యసభ పదవీకాలం.. ఈ ఏడాది జూన్ తో ముగియనుంది. దీంతో ఆయన కాంగ్రెస్‌లో తిరిగి చేరేందుకు సిద్ధమయ్యారు. అయితే డీఎస్ రాకపై.. రాష్ట్ర కాంగ్రెస్‌లో భిన్నాభిప్రాయాలు వినిపిస్తున్నాయి. అయినా అధిష్టానం మాత్రం ఆయన చేరికకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇప్పటికే పార్టీ అధినేత్రి సోనియా, ఇతర పెద్దలను కలిసి రీ-ఎంట్రీ పై చర్చించారు. పునరామనం తర్వాత.. ఆయనకు పార్టీలో ఏ బాధ్యత అప్పగిస్తారు ? ఆయన ఎలాంటి పాత్ర పోషిస్తారు అనేది చూడాలి.