జపాన్ మాజీ ప్రధాని షింజో అబే మరణంపై యూఏస్ఏ ప్రెసిడెంట్ జో బైడెన్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. నా స్నేహితుడు, జపాన్ మాజీ ప్రధాని షింజో అబే ఎన్నికల ప్రచారంలో ఉన్న సమయంలో కాల్చి చంపారనే వార్తతో దిగ్భ్రాంతికి లోనయ్యానని.. బాధపడ్డానని..ఈ విషాదకర సమయంలో అమెరికా జపాన్‌కు అండగా నిలుస్తుందని జో బైడెన్ అన్నారు. ఆయన మరణం జపాన్ దేశాన్ని తీవ్ర విషాదంలోకి నెట్టేసిందని ఆయన అన్నారు. అబేతో సన్నిహితంగా పనిచేసే అవకాశం లభించిందని బైడెన్ అన్నారు.…
తెలంగాణ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ 70 సీట్లు గెలుస్తుందని.. పార్టీ సర్వేలో అదే తేలిందని కాంగ్రెస్ ప్రచార కమిటీ ఛైర్మన్ మధుయాష్కీ గౌడ్ చెప్పారు. కాంగ్రెస్‌ను ఢీకొట్టే పరిస్థితి బీజేపీకి ఏమాత్రం లేదని, కాంగ్రెస్ అధికారంలోకి రావడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. కాంగ్రెస్‌లో మంత్రులుగా చేసిన కొందరు కోట్లు సంపాదించారని, పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు మాత్రం వాళ్లు వెన్నుపోటు పొడిచారని ఆరోపించారు. అలాంటి వాళ్లకు తాము బుద్ధి చెప్తామని హెచ్చరించారు. పార్టీ బలమే కార్యకర్తలని వెల్లడించారు.…
కొంతకాలం నుంచి తెలంగాణ కాంగ్రెస్ నేతల మధ్య కొనసాగుతున్న అభిప్రాయ బేధాలు పూర్తిగా తొలగిపోయాయని సీనియర్ నేత వీ హనుమంతరావు క్లారిటీ ఇచ్చారు. అలాగే.. కాంగ్రెస్ పార్టీని పీజేఆర్ తనయుడు విష్ణువర్ధన్ రెడ్డి వీడుతున్నారని జరుగుతున్న ప్రచారంపై కూడా స్పష్టతనిచ్చారు. కాంగ్రెస్ పార్టీని కాపాడేందుకు అప్పట్లో స్వర్గీయ పీజేఆర్ ఎన్నో సంవత్సరాలు కష్టపడ్డారని, ఆయన కొడుకుగా విష్ణు వర్ధన్ పార్టీని వీడే ప్రసక్తే లేదని వెల్లడించారు. చచ్చే వరకు కాంగ్రెస్ పార్టీలోనే విష్ణు కొనసాగుతాడని అన్నారు. విష్ణు…
సోనియా గాంధీ పర్సనల్ సెక్రెటరీపై రేప్ కేసు నమోదు చేశారు పోలీసులు.. ఉద్యోగం ఇప్పిస్తానని ప్రలోభాలకు గురుచేసి తనపై అఘాయిత్యానికి పాల్పడ్డాడంటూ బాధితురాలి ఫిర్యాదు మేరకు 71 ఏళ్ల పీపీ మాధవన్‌పై అత్యాచారం అభియోగాలు మోపారు పోలీసులు
ఈడీ విచారణకు హాజరు కావాల్సి ఉన్న నేపథ్యంలో ఈడీకి లేఖరాశారు సోనియా గాంధీ.. విచారణను ప్రస్తుతం వాయిదా వేయాలని అభ్యర్థించారు.. ఈడీ ముందు హాజరయ్యేందుకు మరింత సమయం కావాలని లేఖలో కోరారు కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ..
నేషనల్ హెరాల్డ్ పత్రికకు సంబంధించి మనీ లాండరింగ్ కేసులో కాంగ్రెస్ సీనియర్ నేత రాహుల్ గాంధీ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) విచారణకు హాజరయ్యారు. ఇప్పటికే ఆయనను అధికారులు 40 గంటలకు పైగా ప్రశ్నించిన విషయం తెలిసిందే. ఇవాళ ఐదోరోజు మరోసారి రాహుల్‌ను ప్రశ్నిస్తున్నారు. నేటితో ఆయన విచారణ ముగియనున్నట్లు తెలుస్తోంది. మరోవైపు సోనియా గాందీ కూడా ఈ కేసులో ఈ నెల 23న ఈడీ అధికారుల ముందు విచారణకు హాజరు కావాల్సి ఉంది. సోనియాగాంధీ ఇప్పటికే ఈడీ ముందు…
నేషనల్ హెరాల్డ్ కేసులో కాంగ్రెస్ సీనియర్ నేత రాహుల్ గాంధీ సోమవారం నాలుగోరోజు కూడా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) విచారణకు హాజరయ్యారు. దాదాపు 12 గంటలపాటు ఈడీ ఆయనను సుదీర్ఘంగా విచారించింది. జూన్ 13, 14, 15 తేదీల్లో రాహుల్‌ను 30 గంటలకు పైగా ఈడీ లోతుగా విచారించడం తెలిసిందే. గత వారంలో వరుసగా మూడు రోజులు ఈడీ ప్రశ్నల పరంపరను ఎదుర్కొన్న రాహుల్.. సోమవారమూ హాజరయ్యారు. ఉదయం 11 గంటల సమయంలో ఈడీ ప్రధాన కార్యాలయానికి రాహుల్…
కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు.. కోవిడ్ అనంతర సమస్యల కారణంగా ఢిల్లీలోని సర్ గంగా రామ్ ఆసుపత్రిలో చేరిన సోనియా.. దాదాపు వారం తర్వాత ఇవాళ డిశ్చార్జ్ అయ్యారు.. ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు కాంగ్రెస్ పార్టీ ఎంపీ జైరాం రమేష్.. ఈ సాయంత్రం సర్ గంగారామ్ ఆసుపత్రి నుండి సోనియా గాంధీ డిశ్చార్జ్ అయ్యారని మరియు ఇంట్లో విశ్రాంతి తీసుకోవాలని వైద్యులు సూచించారని పేర్కొంటూ ట్వీట్ చేశారు…
నేషనల్ హెరాల్డ్ కేసులో విచారణ నిమిత్తం కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఈడీ కార్యాలయానికి చేరుకున్నారు. మనీలాండరింగ్ కేసులో ఈడీ అధికారులు వరుసగా నాలుగోసారి ప్రశ్నిస్తున్నారు. రాహుల్ గాంధీని ఇప్పటి వరకు దాదాపు 30 గంటల పాటు ఈడీ విచారించింది. శుక్రవారమే విచారణకు రావాలని ఈడీ రాహుల్‌కు సమన్లు జారీ చేయగా.. మూడు రోజులు సమయం ఇవ్వాలని కోరారు. తన తల్లి సోనియా గాంధీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారని, ఈ క్రమంలో 17న కాకుండా 20న విచారణకు…