ఈడీ పేరిట ఏఐసీసీ అధినేత్రి సోనియా గాంధీని కేంద్ర ప్రభుత్వం వేధింపులకు పాల్పడుతోందని తెలంగాణ కాంగ్రెస్ నేతలు ఆగ్రహం వ్యక్తం చేసారు. హస్తం పార్టీపై కక్షపూరితంగానే కేంద్ర సర్కార్ వ్యవహరిస్తోందని మండిపడ్డారు. అప్రజాస్వామిక పద్దతిలో ఈడీ సోనియాగాంధీని విచారిస్తోందని వివమర్శించారు. ప్రజలు గమనిస్తున్నారని, త్వరలోనే కేంద్ర ప్రభుత్వానికి గుణపాఠం చెబుతారని ఆగ్రహం వ్యక్తం చేసారు. అయితే.. సోనియాపై ఈడీ కేసు నేపథ్యంలో దేశవ్యాప్తంగా ఆందోళనకు పిలుపునిచ్చిన నేపథ్యంలో రాష్ట్రంలోనూ నేతలు ధర్నాకు దిగారు. నగరంలోని నెక్లెస్‌రోడ్‌లోని ఇందిరా గాంధీ విగ్రహం నుంచి ర్యాలీగా బషీర్‌బాగ్ ఈడీ కార్యాలయానికి వెళ్లారు. ఈర్యాలీలో టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి, మర్రి శశిధర్ రెడ్డి, పలువురు నేతలు పాల్గొన్నారు. కాగా.. ఇందిరా పార్కు వద్ద కాంగ్రెస్ నాయకులు, నిరసనలకు వెళ్లకుండా పోలీసులు అరెస్టు చేశారు.
read also: Sita Ramam: ఎన్నాళ్ళ కెన్నాళ్ళ కెన్నాళ్ళకు….
అయితే ఈనేపథ్యంలో.. కాంగ్రెస్ నగర అధ్యక్షుడు అంజన్‌కుమార్ యాదవ్ మాట్లాడుతూ.. ఏఐసీసీ అధినేత్రి సోనియాగాంధీని ఈడీ పేరిట కేంద్ర ప్రభుత్వం వేధింపులకు గురిచేస్తోందని మండిపడ్డారు. కాగా.. ఆదర్శనగర్‌లోని న్యూ ఎమ్మెల్యే క్వార్టర్స్ నుంచి అంజన్ కుమార్ నల్ల దుస్తులు.. బెలూన్స్ ప్రదర్శిస్తూ బషీర్‌బాగ్‌లోని ఈడీ కార్యాలయానికి తరలివెళ్లారు. మోడీకి వ్యతిరేకంగా నినాదాలు చేసి, సోనియా గాంధీని ఈడీ పేరుతో కేంద్ర ప్రభుత్వం వేధించడాన్ని ఆయన ఖండించారు. అయితే.. కేంద్రం ఇలాంటి చర్యలతో.. తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు.
Marigold Face Mask: ముఖం మెరవాలంటే.. ముద్దబంతి పువ్వుతో ఇలా చేయండి