Sonam Wangchuk: రాష్ట్ర హోదా కోసం ఇటీవల కేంద్రపాలిత ప్రాంతం లడఖ్ అట్టుడికింది. హింసాత్మక ఘటనలు చోటు చేసుకున్నాయి. బీజేపీ కార్యాలయాన్ని తగలబెట్టడంతో పాటు సీఆర్పీఎఫ్ సిబ్బంది, వాహనాలపై దాడులు జరిగాయి. ఈ అల్లర్లలో నలుగురు మరణించగా, పదుల సంఖ్యలో మంది గాయాలపాలయ్యారు.
Sonam Wangchuk: బుధవారంలో లడఖ్‌కు రాష్ట్ర హోదా కోరుతూ హింసాత్మక అల్లర్లు జరిగాయి. ఈ ఆందోళనల్లో నలుగురు మరణించడంతో పాటు 50కి పైగా మంది గాయపడ్డారు. గాయపడిన వారిలో ఆందోళనకారులతో పాటు పోలీసులు, ఇతర భద్రతా సిబ్బంది ఉన్నారు. ఆందోళనకారులు బీజేపీ కార్యాలయానికి నిప్పుపెట్టడంతో పాటు, భద్రతా సిబ్బందిపై దాడి చేశారు. అయితే, ఈ హింసను ప్రేరేపించేలా చేశాడని లడఖ్ కార్యకర్త సోనమ్ వాంగ్‌చుక్‌పై కేంద్ర ప్రభుత్వం కేసు పెట్టింది.
Sonam Wangchuk: రాష్ట్ర హోదా కోరుతూ, లడఖ్ వ్యాప్తంగా హింసాత్మక అల్లర్లు జరిగాయి. భద్రతా బలగాలు, బీజేపీని టార్గెట్ చేస్తు ఆందోళనకారులు హింసకు పాల్పడ్డారు. ఈ అల్లర్లలో నలుగురు మరణించారు, పదుల సంఖ్యలో గాయపడ్డారు.ఈ అల్లర్లు ఉద్దేశపూర్వకంగా చేయబడ్డాయని లెఫ్టినెంట్ గవర్నర్ కవిందర్ గుప్తా ఆరోపిస్తూ, లేహ్ వ్యాప్తంగా ఖర్ఫ్యూ విధించారు. అల్లర్ల వెనక ఉన్న ప్రతీ వ్యక్తిపై చర్యలు ఉంటాయని హెచ్చరించారు.
లడఖ్ అల్లర్ల నేపథ్యంలో వాతావరణ కార్యకర్త సోనమ్ వాంగ్‌చుక్ చిక్కుల్లో పడ్డారు. గత కొద్ది రోజులుగా లడఖ్‌కురాష్ట్ర హోదా కల్పించాలని నిరసన దీక్ష కొనసాగిస్తున్నారు. ఈ నేపథ్యంలో రెచ్చగొట్టే వ్యాఖ్యల నేపథ్యంలో లడఖ్‌లో బుధవారం పెద్ద ఎత్తున హింస చెలరేగింది.
భారత్‌లో నిన్నటిదాకా ప్రశాంత వాతావరణం నెలకొంది. కానీ బుధవారం హఠాత్తుగా లడఖ్‌లో పెద్ద ఎత్తున హింస చెలరేగింది. రాష్ట్ర హోదా పేరుతో నిరసనకారులు రోడ్లపైకి నానా బీభత్సం సృష్టించారు. భద్రతా దళాలపై రాళ్లు రువ్వి.. వాహనాలు తగలబెట్టారు.
Sonam Wangchuk: హోం మంత్రిత్వ శాఖ హామీ మేరకు సోనమ్ వాంగ్‌చుక్ తన ఆమరణ నిరాహార దీక్షను విరమించారు. తాజాగా ఆయనని జమ్మూ కాశ్మీర్, లడఖ్ సంయుక్త కార్యదర్శి ప్రశాంత్ లోఖండేను కలుసుకున్నాడు. లడఖ్ ప్రతినిధులతో చర్చలు జరుపుతున్న మంత్రిత్వ శాఖ అత్యున్నత కమిటీ హోం మంత్రిత్వ శాఖ నుండి ఒక లేఖను అతనికి అందజేసింది. ఆయనతో తదుపరి సమావేశం డిసెంబర్ 3న జరగనుంది. దీని తరువాత వాంగ్‌చుక్, అతని మద్దతుదారులు తమ నిరాహార దీక్షను విరమించాలని…
Sonam Wangchuk: కేంద్రపాలిత ప్రాంతానికి రాష్ట్ర హోదా ఇవ్వడంతో పాటు రాజ్యాంగ పరిరక్షణ డిమాండ్లపై పర్యావరణ కార్యకర్తల కేంద్రానికి అల్టిమేటం జారీ చేశారు. ప్రభుత్వం లడఖ్ అధికారుల్ని చర్చలకి ఆహ్వానించకుంటే ఆగస్టు 15 స్వాతంత్య్ర దినోత్సవం నుంచి నిరాహార దీక్ష చేస్తానని ఆదివారం హెచ్చరించారు.
Sonam Wangchuk: లడఖ్ రాష్ట్ర హోదా కల్పించాలని, రాజ్యాంగంలోని 6వ షెడ్యూల్‌లో చేర్చాలని గత 21 రోజులుగా నిరాహార దీక్ష చేస్తున్న హక్కుల కార్యకర్త సోనమ్ వాంగ్‌చుక్ మంగళవారం లేహ్‌లో తన నిరాహార దీక్షను విమరించారు. మైనర్ బాలిక ఇచ్చిన నిమ్మరసాన్ని తాగి నిరాహార దీక్షను విరమించారు.