బీజేపీ నేత, నటి సోనాలీ ఫోగాట్ అనుమానాస్పద మృతి కేసులో దర్యాప్తు కొనసాగుతోంది. హర్యానాలోని హిసార్ జిల్లాలోని సంత్‌నగర్ ప్రాంతంలో గల దివంగత నటిసోనాలి ఫోగాట్ నివాసంలో గోవా పోలీసులు వరుసగా మూడో రోజు తనిఖీలు చేశారు.
సోనాలీ ఫోగాట్ హత్య కేసు అనంతరం రోజుకొక కొత్త విషయం వెలుగులోకి వస్తోంది. తాజాగా ఈ కేసులో మరో ట్విస్ట్ వెలుగుచూసింది… సోనాలీ ఫాం హౌస్‌లో ఉన్న ఆమె ఫోన్, ల్యాప్ టాప్ లను… కంప్యూటర్ ఆపరేటర్ చోరీ చేశారని ఆమె కుటుంబసభ్యులు.. పోలీసులకు ఫిర్యాదు చేశారు. సోనాలీకి సంబంధించిన ల్యాప్ టాప్, డీవీఆర్, మొబైల్ ఫోన్, ఇతర ఆఫీసు సామాగ్రిని కంప్యూటర్ ఆపరేటర్ ఎత్తుకెళ్లాడని పోలీసుల దర్యాప్తులో తేలింది. దీంతో ఫోన్, ల్యాప్ టాప్ లను…